Skip to main content

PU Faculty: పీయూ అధ్యాపకుల నూతన ఆవిష్కరణ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ మ్యాథమెటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధ్యాపకులు నూతన ఆవిష్కరణ సృష్టించారు.
Innovative oxygen therapy control software developed by university researchers  Innovation by PU faculty  Palamuru University Mathematics Department faculty members demonstrating oxygen therapy innovation

ఆస్పత్రుల్లో రోగులకు అందించే ఆక్సిజన్‌ థెరపీలో మ్యానువల్‌ విధానంలో ఆక్సిజన్‌ అందించే విధంగా ఇప్పటి వరకు ఉండేది. వీరు ఆవిష్కరించిన విధానం ద్వారా డిజిటల్‌ పద్ధతిలో, ఒక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆక్సిజన్‌ను నియంత్రించే అవకాశం ఉంది.

చదవండి: Vice Chancellor Posts: వైస్‌చాన్స్‌లర్‌ పోస్టులకు భారీగా దరఖాస్తులు

‘ఐఓటీ బేస్‌డ్‌ పోర్టబుల్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌’ను ఆవిష్కరించారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటలెక్సువల్‌ ప్రాపర్టీ ఇండియా నుంచి డిజైన్‌ విభాగంలో ఆమోదం లభించింది. అందుకు సంబంధించి ధ్రువపత్రాలను సంస్థ నుంచి అధ్యాపకులు అందుకున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

పీయూ పరిధిలో పనిచేసే మోటూరి మధు, సత్యమ్మ, భారతి ఈ ఆవిష్కరణలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ చంద్రకిరణ్‌ అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో అర్జున్‌కుమార్‌, రాఘవేందర్‌, రవికుమార్‌, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 04 Oct 2024 04:13PM

Photo Stories