తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 20,05,947 మంది విద్యార్థులకుగాను సెప్టెంబర్ 3న 8,57,749 మంది (42.76 శాతం) హాజరయ్యారని విద్యాశాఖ వెల్లడించింది.
పాఠశాలల్లో పెరిగిన హాజరు శాతం
ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో 82,400 మందికి 13,196 మంది (15.04 శాతం) హాజరయ్యారని పేర్కొంది. అలాగే, ప్రైవేట్ పాఠశాలల్లో 52,73,003 మంది విద్యార్థులకు 15,96,430 మంది (30.28 శాతం) హాజరయ్యారని వివరించింది. గత రెండు రోజులతో పోలిస్తే విద్యార్థుల హాజరుశాతం స్వల్పంగా పెరిగిందని పేర్కొంది.