ANU: ఏఎన్‌యూకు గ్రీన్ యూనివర్సిటీ అవార్డు
ఇండో–అమెరికన్ గ్రీన్ స్కూల్ నెట్‌వర్క్, నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయెన్స్, న్యూయార్క్ క్‌లైమేట్ వీక్ సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన ‘6వ న్యూయార్క్ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్–2022’లో ఏఎన్‌యూకు ఈ అవార్డును ప్రకటించారు. అమెరికాలో జరిగిన కాన్ఫరెన్స్‌కు ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ వర్చువల్‌గా హాజరై యూనివర్సిటీ నివేదికను ప్రజంటేషన్ చేశారు. యూనివర్సిటీలో పాలిథిన్ నిషేధం, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, గార్డెన్స్ నిర్వహణ, ఈ–ఆఫీస్ వినియోగం, పరిశుభ్రమైన నీరు, గాలి తదితర అంశాలను వివరించారు. వీటి ఆధారంగా ఏఎన్‌యూకు గ్రీన్ యూనివర్సిటీ అవార్డును ప్రకటించారు. ఏఎన్‌యూ 2021లో జాతీయ స్థాయిలో గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకును సాధించగా, ఈ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకు పొందింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 26న ఏఎన్‌యూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థుల సమష్టి కృషితోనే అంతర్జాతీయ స్థాయిలో అవార్డు సాధ్యమైందని తెలిపారు. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కో–ఆర్డినేటర్‌ను వీసీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ బి.కరుణ, సీడీసీ డీన్ డాక్టర్ కె.మధుబాబు, రీసెర్చ్ సెల్ కో–ఆర్డినేటర్ ఆచార్య ఎల్.ఉదయకుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: