NCISM: ఆయుర్వేద వైద్య కళాశాల అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్
National Commission for Indian System of Medicine (NCISM) షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందని వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్‌గౌడ్ తెలిపారు. నవంబర్ 25 సాయంత్రం ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. ‘వరంగల్ ఆయుర్వేద కళాశాలలో అడ్మిషన్లు రద్దు’అంటూ అక్టోబర్ 27న సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై విద్యార్థులు అందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
చదవండి: Nallamala forest: అరుదైన ఔషధిగా ‘అగ్నిశిఖ’(Gloriosa superba)
ఈ విషయంపై తెలంగాణ రాష్ట్రంలోని ఆయుష్ అధికారులు నవంబర్ 2వ తేదీన కళాశాలను సందర్శించారు. ఎన్‌సీఐఎస్‌ఎంకు అఫిడవిట్‌ను అందజేశారు. దీంతో కొన్ని షరతులతో అడ్మిషన్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. వైద్యకళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను డిసెంబర్ 31లోగా భర్తీ చేసి ఎన్‌సీఐఎస్‌ఎంకు సమాచారం ఇస్తేనే 2023–24 సంవత్సరంలో అడ్మి షన్లకు అనుమతి ఇస్తామని ఆదేశాల్లో పేర్కొన్నట్లు రవీందర్‌గౌడ్ తెలిపారు.