National Girls' Day: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జనవరి 24న జిల్లా స్త్రీ శిశు సంక్షేమ, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ, జిల్లా మహిళా సాధికార త కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్స వం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలు వద్దు అనుకుంటే.. రేపటి సమాజం అమ్మలేని అనాథ అవుతుందన్నారు. భేటీ పడావో.. భేటీ బచావో కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
చదవండి: National Girl Child Day 2024: జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం.. ఈ రోజు చరిత్ర ఇదే..!
బాలికలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కేజీబీవీలు, ఆశ్రమాల్లో విద్యార్థినుల సంక్షేమం కోసం ప్రభుత్వ అనేక కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. రక్షణ, స్వేచ్ఛ కోసం అమల్లో ఉన్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా సంక్షేమశాఖ అధికారి సావిత్రి, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, డీఎంహెచ్‌వో తుకారాం, జీసీడీవో శకుంతల, జెడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, మహిళా సాధికారత కేంద్రం సభ్యులు శారద, మమత, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.