Nirosha Devi: ఆర్బీకేలపై ఏపీ యువతి ప్రాజెక్ట్‌కు విదేశీ వర్సిటీ గోల్డ్ మెడల్
ఈ పథకానికి ఎంపికైన బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం తాళ్లపొలానికి చెందిన టేకుమూడి నిరోషా దేవి యునెటైడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చదువుతోంది. ఆమె తన కోర్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలపై ప్రాజెక్టు చేపట్టింది.
చదవండి: Rythu Bharosa Kendralu: యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా ఆర్బీకేలు.. ఇకపై తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్
ఏపీలో వ్యవసాయ విధానాలు, రైతు ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపు వంటి అంశాలపై అధ్యయనం చేసింది. దీన్ని యూనివర్సిటీ ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. బర్మింగ్‌హామ్ వర్సిటీలో అనేక దేశాల విద్యార్థులు చదువుతున్నారు. వారు కూడా వివిధ ప్రాజెక్టులు చేసినా నిరోషా దేవి ఆర్బీకేలపై చేసిన ప్రాజెక్టే అత్యుత్తమంగా నిలిచింది. దీంతో యూనివర్సిటీ నుంచి ప్రేయాస్ ఫీల్డ్ అవార్డు దక్కించుకుంది. అంతేకాకుండా గోల్డ్‌మెడల్‌ను కూడా సొంతం చేసుకుంది.
అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్..
వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన అమలు చేసిన ఫీజురీయింబర్స్‌మెంట్ వల్లే నిరోషా దేవి రాష్ట్రంలో ఇంజనీరింగ్ అభ్యసించింది. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన పథకంతో ఆమెను ఆదుకోవడంతో యూకేలో ఎంబీఏ చదువుతోంది.
ఈ నేపథ్యంలో తాను సాధించిన అవార్డును, గోల్డ్ మెడల్‌ను సీఎం జగన్‌కు అంకితమిస్తున్నట్టు నిరోషా దేవి వెల్లడించింది. ఆయన వల్లే తాను విదేశాల్లో చదువుకోగలుగుతున్నానని కృతజ్ఞతలు తెలిపింది. కాగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నిరోషా దేవి భర్త, కట్టా సర్వాని, మామ సూర్యనారాయణ ఆదివారం కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిరోషా దేవి గోల్డ్ మెడల్ సాధించడంపై అభినందనలు తెలియజేశారు.