Law Nestham: యువ న్యాయవాదులకు ఆర్థిక భరోసా
డిసెంబర్ 11న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకానికి సంబంధించి 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను 2023 జూలై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల కాలానికి నెలకు రూ. 5 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో రూ.7.99 కోట్లు జమ చేశారు.
ఈ కార్యక్రమానికి నెల్లూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, నెల్లూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ప్రసాద్‌రావు, యువ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ లా కోర్సు పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ లా నేస్తం’ కార్యక్రమం ద్వారా నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు.
చదవండి: Lawyer to IPS Journey: న్యాయవాది నుంచి ఐపీఎస్ గా విజయం.. ఎలా..?
యువ న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రాక్టీస్‌లో బాగా రాణించాలని ఆకాంక్షించారు. 2023 జూలై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల కాలానికి జిల్లాలో 141 మంది యువ న్యాయవాదులకు రూ.42.30 లక్షలు జమ చేసినట్లు తెలిపారు.
ఇంకనూ అర్హులైన యువ న్యాయవాదులు వైఎస్సార్ లా నేస్తం పథకానికి తమ పేర్లు నమోదు చేసుకోవాలని జేసీ సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లసిరి మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.