Sapavat Renuka: చదువుల తల్లికి ఆర్థికసాయం
తండాకు చెందిన పేద విద్యార్థిని రేణుక సిరిసిల్లలోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే ఆమె ఫీజు చెల్లించలేని పరిస్థితిపై ఈనెల 13న సాక్షిలో ‘చదువుల తల్లికి సాయం చేయండి’ అనే కథనం ప్రచురితమైంది. ఈమేరకు పలువురు దాతల నుంచి సేకరించిన రూ.32,465లను ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మూడావత్ మోహన్ విద్యార్థినికి అందజేశారు.
చదవండి: Mana ooru Mana Chettu: పాఠశాల విద్యార్థుల కథలు.. చరిత్రకు శ్రీకారం
కాగా ప్రతీ సెమిస్టర్ మెస్ బిల్లు తానే చెల్లిస్తానని మోహన్ తెలిపారు. అలాగే యూనివర్సిటీలో డాక్టర్ రాజేందర్ ఆధ్వర్యంలో తోటి విద్యార్థులు, దాతలు కలిసి సెప్టెంబర్ 26న రూ.7,800 అందజేశారు. దీంతో ఆమె అడ్మిషన్ ఫీజు చెల్లించి ద్వితీయ సంవత్సరంలో చేరింది. తన చదువుకోసం ఆర్థికసాయం అందజేసిన దాతలకు రేణుక కృతజ్ఞతలు తెలిపింది.