Skip to main content

Degree: డిగ్రీ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాన్ ప్రొఫెషనల్ యూజీ డిగ్రీ కోర్సుల్లో 2021–22 విద్యా సంవత్సరం ప్రవేశానికి ఆన్ లెన్ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 25 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్కుమార్ తెలిపారు.
Degree
Degree: డిగ్రీ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు

సెప్టెంబర్‌ 22న ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో నిర్ణీత కేంద్రాల్లో తమ ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 53 హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

సవరించిన షెడ్యూల్‌ ఇలా..

  • దరఖాస్తు గడువు: సెప్టెంబర్‌ 25 వరకు
  • ప్రత్యేక కేటగిరీ పరిశీలన: సెప్టెంబర్‌ 23, 24
  • వెబ్‌ అప్షన్ల నమోదు: సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 2 వరకు
  • సీట్ల కేటాయింపు: అక్టోబర్‌ 5
  • తరగతుల ప్రారంభం: అక్టోబర్‌ 6.
Published date : 23 Sep 2021 01:13PM

Photo Stories