Tenth Class Public Exams Evaluation :నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జవాబు పత్రాల మూల్యాంకనం
Sakshi Education
Tenth Class Public Exams Evaluation :నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జవాబు పత్రాల మూల్యాంకనం
Evaluation of answer sheets of class 10th public examinations from today
నెల్లూరు : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. స్థానిక పొదలకూరురోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం జరగనుంది. ఇతర జిల్లాల నుంచి 1,80,393 జవాబు పత్రాలు జిల్లాకు వచ్చాయి. మూల్యాంకనం కోసం 169 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 1,055 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 375 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. ఇప్పటికే మూల్యాంకనానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు.