Telangana: వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి
Sakshi Education
మిర్యాలగూడ టౌన్ : విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని డీఐఈఓ దస్రూనాయక్ కోరారు.
డిసెంబర్ 19న మిర్యాలగూడలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆన్ జాబ్ ఒకేషనల్ కోర్స్ శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయిలో రెగ్యులర్ విద్యతో పాటు వృత్తి విద్యా కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
చదవండి: Free Training: వృత్తివిద్యా కోర్సుల్లో మహిళలకు శిక్షణ
కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సంవత్సరం పాటు అప్రెంటిషిప్ కోర్సులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కోర్స్‌లో ప్రతి విద్యార్థికి రూ.3 వేలు పారితోషికంగా అందించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ ధన్‌రాజ్, లెక్చరర్లు నాగరాజు, వరలక్ష్మి, వెంకటరమణ ఉన్నారు.
Published date : 21 Dec 2023 11:42AM