Skills: నైపుణ్యాల పెంపుతో స్థానికంగానే ఉపాధి
దీనిలో భాగంగా 30 వరకూ స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు, యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తాడేపల్లిలో అక్టోబర్ 8న అప్లైడ్ రోబో కంట్రోల్ సర్టిఫికేషన్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోర్సును సజ్జల లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండో యూరోసింక్ అండ్ జర్మన్ వర్సిటీ సంస్థ రాష్ట్రంలో 2,400 మందికి రోబోటిక్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా రోబో స్కిల్ కప్ పేరుతో పోటీ పెట్టి రూ.3 లక్షల మేర ప్రోత్సాహకాన్ని అందించడాన్ని సజ్జల ప్రశంసించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జర్మనీ సంస్థ సహకారంతో 2019 నుంచి ఇప్పటి వరకు 1200 మంది విద్యార్థులు ఫస్ట్ లెవల్ కోర్సు పూర్తి చేసి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు.
చదవండి: