Schools: స్కూళ్లకు దసరా సెలవులు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల విద్యార్థులకు అక్టోబర్ 11వ తేదీనుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
ఈసారి రెండో శనివారం, ఆదివారాలు కలసి రావడంతో సెలవు రోజుల సంఖ్య పెరగనుంది. 11వ తేదీనుంచి 16వ తేదీ వరకు ఆరు రోజుల పాటు దసరా సెలవులుగా పాఠశాల విద్యా క్యాలెండర్‌లో పొందుపరిచారు. అయితే అక్టోబర్ 9వ తేదీ రెండో శనివారం, ఆ తరువాత 10వ తేదీ ఆదివారం కావడంతో పాఠశాలలు 8వ తేదీ వరకే పనిచేయనున్నాయి. ఇక 17వ తేదీ ఆదివారం రావడంతో పాఠశాలలు 18వ తేదీనుంచి పునఃప్రారంభం కానున్నాయి. దసరాకు మొత్తంగా 9 రోజులు సెలవులు కలసి రానున్నాయి.
Published date : 07 Oct 2021 01:24PM