TSCHE: దోస్త్ రెండో దశలో కేటాయించిన సీట్లు.. కోర్సుల వివరాలు
ఈ దశలో మొత్తం 49,267 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఇందులో 35,195 మంది వారు పెట్టుకున్న మొదటి ఆప్షన్ మేరకే ఆయా కాలేజీలు, కోర్సుల్లో సీట్లు పొందినట్టు తెలిపారు. 14,072 మందికి రెండో ఆప్షన్ మేరకు సీట్లు వచ్చినట్టు వివరించారు. ఈ దశలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 14 వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. తొలిదశలో 73 వేల సీట్లను కేటాయించారు. ఇందులో 60 వేలకుపైగా విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు.
చదవండి: DOST: కోరుకున్న కాలేజీ.. కోర్సు.. ఈ కోర్సులకు ఫుల్ క్రేజ్
నేటి నుంచి మూడో దశ కౌన్సెలింగ్
దోస్త్ మూడో విడత కౌన్సెలింగ్ జూలై 1 నుంచి మొదలవుతుందని లింబాద్రి తెలిపారు. విద్యార్థులు జూలై 14 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 15వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపారు. మూడో విడత సీట్ల కేటాయింపు జూలై 20న ప్రకటిస్తామన్నారు. డిగ్రీ తరగతులు జూలై 24 నుంచి మొదలవుతాయని వెల్లడించారు.
చదవండి: TSCHE: డిగ్రీ చేస్తే జాక్‌పాట్.. కొన్నేళ్ళుగా డిగ్రీలో ప్రవేశాలు ఇలా..