Skip to main content

DOST: నోటిఫికేషన్‌ విడుదల

ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరిక ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్, తెలంగాణ (దోస్త్‌) నోటిఫి కేషన్‌ను జూన్‌ 29న తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి విడుదల చేశారు.
DOST
దోస్త్ నోటిఫికేషన్‌ విడుదల

రిజిష్ట్రేషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి మొదలు కానుంది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో దోస్త్‌ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, డి ఫార్మసీలో చేరాలన్నా దోస్త్‌ రిజిష్ట్రేషన్‌ తప్పనిసరి. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను మరింత సులభతరం చేసినట్టు ప్రొఫెసర్‌ లింబాద్రి ఈ సందర్భంగా తెలిపారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ కూడా ఆన్‌లైన్‌ ద్వారానే చేపడుతున్నామన్నారు. ఫేస్‌పాత్‌ (ముఖం ద్వారా గుర్తింపు) వెసులుబాటు తీసుకొచ్చామని, జీపీఎస్‌ ద్వారా కాలేజీల వివరాలు పొందే వీలుందని చెప్పారు. తొలిసారిగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాను (ఈడబ్ల్యూ ఎస్‌) అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,080 డిగ్రీ కాలేజీల్లో 4,68,880 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గత ఏడాది 2,55,021 సీట్లల్లోనే కేటాయింపులు జరిగాయని వివరించారు. 15 శాతానికి తక్కువగా అడ్మిషన్లు జరిగే కోర్సులను రద్దు చేసి, విద్యార్థులను ఇతర కోర్సులకు లేదా కాలేజీలకు మళ్ళిస్తామని లింబాద్రి చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 11 ప్రైవేటు అటానమస్‌ కాలేజీల్లో ఆర్టిఫిషి యల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సును అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల కార్య క్రమంలో మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. వెంకటరమణ, కార్యదర్శి ఎన్‌.శ్రీనివా సరావు తదితరులు పాల్గొన్నారు.

దోస్త్‌ షెడ్యూల్‌ ఇలా...

రూ. 200తో రిజిస్ట్రేషన్‌

1–7–22 –  30–7–22

వెబ్‌ ఆప్షన్లు

6–7–22 –  30–7–22

పీహెచ్‌సీ, ఎన్‌సీసీ వంటి ప్రత్యేక వర్గం ధ్రువపత్రాల పరిశీలన

28, 29–7–22

మొదటి దశ సీట్ల కేటాయింపు

6–8–22

ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

7–8–22 – 18–8–22

రెండో దశ రిజిష్ట్రేషన్‌ రూ. 400తో

7–8–22 –  21–8–22

వెబ్‌ ఆప్షన్లు (రెండో దశ)

7–8–22 –  22–8–22

రెండో దశ సీట్ల కేటాయింపు

27–8–22

రెండో దశ ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

27–8–22 – 10–9–22

3వ దశ రిజిష్ట్రేషన్‌ (రూ. 400తో)

29–8–22 – 12 –9–22

3వ దశ వెబ్‌ ఆప్షన్లు

29–8–22 – 12–9–22

3వ దశ సీట్ల కేటాయింపు

16–9–22

3వ దశ ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

16–9–22 – 22–9–22

అన్ని దశల్లోని వారు కాలేజీలో రిపోర్టింగ్‌

16–9–22 – 22–9–22

ఓరియెంటేషన్‌

23–9–22 – 30–9–22

తరగతులు ప్రారంభం

1–10–22

డిగ్రీ సీట్ల వివరాలు...

సంస్థలు

కాలేజీల సంఖ్య

సీట్లు

ప్రభుత్వ కాలేజీలు

119

61,260

ప్రభుత్వ అటానమస్‌

9

12,900

ప్రైవేటు ఎయిడెడ్‌

32

13,455

ప్రైవేటు ఎయిడెడ్‌ అటానమస్‌

4

1,070

ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌

697

2,93,115

ప్రైవేట్‌ అటానమస్‌

80

30,810

రైల్వే పరిధిలో

1

132

యూనివర్సిటీ (అటానమస్‌)

3

3,478

యూనివర్సిటీ కాలేజ్‌

2

880

ఎస్‌బీటెట్‌

15

840

రెసిడెన్షియల్‌ కాలేజీలు

53

16,044

మైనార్టీ కాలేజీలు

65

34,896

Published date : 30 Jun 2022 04:34PM

Photo Stories