Republic Day ఎందుకు జరుపుకుంటారో తెలుసా?.. ఈసారి ముఖ్య అతిథి ఎవరంటే..
Sakshi Education
భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందింది.
అందుకే భారతీయులు ప్రతి సంవత్సరం ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే భారతీయులు దేశభక్తిని గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మరొక ముఖ్యమైన రోజు కూడా ఉంది. అదే గణతంత్ర దినోత్సవం . ఇది 1950, జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ప్రస్తుతం యావత్ భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవానికి సిద్ధమవుతోంది.
ముఖ్య అతిథి ఎవరంటే..
భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ నాయకుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి. గతేడాది ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సీసీ హాజరరైన విషయం తెలిసిందే.
Published date : 25 Jan 2024 05:17PM