ఇష్టంగా చదివితే అద్భుతాలే: ఎస్పీ రితిరాజ్, IPS
ఫిబ్రవరి 21న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే అద్భుతాలు సృష్టిస్తారని, ప్రతి విద్యార్థి వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలన్నారు.
సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటే ఆలోచనలు సానుకూలంగా ఉంటాయన్నారు. విద్యార్థులను లక్ష్య సాధనవైపు ప్రోత్సహించాల్సిన బాధ్యత అధ్యాపకులదేనని సూచించారు. ప్రతి విద్యార్థికి ఇంటర్ దశే కీలకమని పేర్కొన్నారు. ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమించాలన్నారు. పరీక్షలంటే విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
చదవండి: Free Training: ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
సానుకూల దృక్పథంతో ఉంటే ఆలోచన దృక్పథంలో మార్పు ఉంటుందన్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు జిల్లా ఎస్పీ రితిరాజ్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ హృదయరాజు, ప్రిన్సిపల్ వీరన్న, అధ్యాపకులు బాలకృష్ణ, శిరీష, పవన్, శేఖర్, అనూష, గీతా, కలీముల్లా, గోపి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.