Department of Health: ఆరోగ్య శాఖకు రూ.490 కోట్లు..
ఈ మేరకు అంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ నివేదికను కేంద్రానికి పంపించింది. రాష్ట్రంలో 10,032 వైఎస్సార్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి కోసం 15వ ఆరి్థక సంఘాన్ని ఎక్కువ నిధులు అడిగారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ల్యా»Ÿరేటరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. వీటికోసం కూడా ఎక్కువ నిధులు అడిగారు. పేద ప్రజలకు స్పెషలిస్ట్ సేవలు అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి అవసరమని భావించిన సర్కారు.. స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికీ ప్రాధాన్యం ఇచి్చంది. 15వ ఆరి్థక సంఘం నిధులు కేటాయిస్తే స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించి, జీవన శైలి జబ్బులకు వైద్యం చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్పెషలిస్ట్ డాక్టర్లు అవసరమవుతున్నారు. ప్రతి పీహెచ్‌సీలో ఒక్కో స్పెషలిస్ట్ రెండు రోజుల పాటు ఔట్ పేషెంట్ సేవలు అందించేలా ఇప్పటికే కార్యాచరణ చేపట్టారు. అంటే ముగ్గురు స్పెషలిస్ట్ డాక్టర్లు ఆరు రోజుల పాటు పీహెచ్‌సీకి వస్తారు. అలా రోజుకు రెండు పీహెచ్‌సీలను స్పెషలిస్ట్ డాక్టర్ చూడాలి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల వారికీ సేవలు అందుతాయని 15వ ఆరి్థక సంఘానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ నిధులు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి మాత్రమేనని అధికార వర్గాలు తెలిపాయి.
చదవండి: