Degree: డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షలు
Sakshi Education
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షలు అక్టోబర్ 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్టు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్‌వీ సుధాకర్‌రెడ్డి తెలిపారు.
పరీక్ష ఫీజులు చెల్లించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీసీఏ, బీహెచ్‌ఎంసీటీ డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు అక్టోబర్ 22 నుంచి జరిగే పరీక్షలకు హాజరు కావాలన్నారు. పరీక్ష కేంద్రాల వివరాలు, పరీక్షల తేదీల వివరాలను ఏయూ వెబ్‌సైట్ www.andhrauniversity.edu.in నుంచి పొందవచ్చునన్నారు. పరీక్ష తేదీకి 5 రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను డౌ¯ŒSలోడ్ చేసుకోవాలని సూచించారు.
చదవండి:
Published date : 02 Oct 2021 12:14PM