Korutla Degree College: అడవిని తలపిస్తున్న కళాశాల ఆవరణ
న్యాక్ గుర్తింపు ఉన్నా..
అర్ధ శతాబ్దం ప్రత్యేకతను కలిగిన కోరుట్ల డిగ్రీ కళాశాలకు ఇటీవల నాక్ శ్రీబీశ్రీ గ్రేడ్ గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో పీఎం ఉషా (ప్రధాన మంత్రి ఉఛ్చతర్ శిక్ష అభియాన్) పథకం కింద కేంద్రం నుంచి కళాశాలకు యూజీసీ గ్రాంట్స్ మంజూరు అవుతాయి. ఏటా సుమారు రూ.2కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు నిధులు వస్తాయి.
చదవండి: Teacher Srinivas: విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలలో ఈ పని చేసిన ఓ ఉపాధ్యాయుడు
ఈ నిధులతో కళాశాలలో ఆధునిక వసతులు, ప్రత్యేక ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, అవసరమైన తరగతి గదులు, అదనపు యాక్టివిటిస్ కోసం నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. సాధారణంగా న్యాక్ గుర్తింపు రావడం కష్టంకాగా..సుమారు రెండేళ్ల క్రితమే ఈ కళాశాలకు న్యాక్ గుర్తింపు వచ్చింది. అయినా కళాశాల పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. లెక్చరర్లు..అధ్యాపకులు మధ్య సమన్వయ లోపంతోనే కళాశాల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రూపుల పోరు..
కొంతమంది అధ్యాపకులు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మ ద్య సమన్వయ లోపంతో విద్యార్థులకు సరైన వసతులు, ఇతరత్రా అవకాశాలు కనుమరుగవుతున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఏడాదికాలంగా ఇరువర్గాల వారు ఒకరి లోపాలు మరొకరు ఎత్తిచూపించుకునే పనిలో ఉండటం.. ఫిర్యాదులు చేసుకోవడం.. లోటుపాట్లను సర్దుబాటు చేసుకుని విద్యార్థుల భవి ష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దడానికి కలిసి ముందుకు కదలకపోవడం సమస్యగా మారింది.
ఈ పోరులో ఎవరివాదన సరైందన్న విషయంలో ఉన్నతాధికారు లెవరూ ఇప్పటివరకు చొరవ తీసుకుని విచారణ జ రపకపోవడం మరో సమస్యగా మారింది. కళా శాల నిర్వహణ, అభివృద్ధి విషయంలో అందరితో సమన్వయపరచడానికి చొరవ తీసుకోవాల్సిన ప్రి న్సిపా ల్ ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
న్యాక్ నిధులు.. ప్రతిపాదనలకే పరిమితం..
కళాశాలలో అధ్యాపకుల గ్రూపుల పోరుతో విద్యార్థులకు అకాడమిక్ పరమైన సమస్యలు.. పాములు, తేళ్లతో నిండి అడవిని మించిన పరిసరాలను సరిచేసే దిశగా చర్యలు చేపట్టేవారు కరువయ్యారు. చివరికి న్యాక్ పీఎం ఉషా పథకం కింద రూ.5 కోట్లు నిధులు కావాలని ఏడాది క్రితం ప్రతిపాదించినా ముందుకు కదలించేలా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఈ పరిస్థితుల్లో విద్యార్థులు తీవ్ర అసహనానికి లోనై తమ సమస్యలను ఏకరువు పెడుతూ ఏకంగా వీడియోలు తీసి డిగ్రీ కళాశాలల కమిషనర్‌కు పంపడం.. అది వైరల్ కావడంతో చర్చనీయంగా మారింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని డిగ్రీ కళాశాల దుస్థితిని సరిచేసి విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.