అంగన్‌వాడీల్లో పిల్లల సంఖ్య పెంచాలి
Sakshi Education
ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లల సంఖ్య పెంచాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం అన్నారు.
ముస్తాబాద్ మండలం గూడెం, ముస్తాబాద్ సెక్టార్‌లలో సోమవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పిల్లల హాజరుశాతం, పె రుగుతున్న బరువు, నిత్యం అందిస్తున్న పౌష్టికాహారం విషయాలు అడిగి తెలుసుకున్నారు. రి కార్డులు పరిశీలించారు.
చదవండి: Teachers Suspension: ఆకస్మిక తనిఖీలో టీచర్ల సస్పెన్షన్.. కారణం..?
కేంద్రాలకు వచ్చే పిల్లలకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాలన్నారు. గుడ్లు, పాలు, భోజనాలను పారదర్శకంగా అందించాలని సూచించారు. సీడీపీవో ఆనందిని, ఫిర్యాదుల విభాగం కమిటీ చైర్మన్ జ్యోతి శుక్లా, డీహబ్ కోఆర్డినేటర్ రోజ, సఖీ కేంద్రం ఇన్‌చార్జి విజయ, సూపర్‌వైజర్లు కళావతి, అరవింద, టీచర్లు పాల్గొన్నారు.
Published date : 31 Oct 2023 01:30PM