కాలేజీ పక్కనే కోళ్ల వ్యర్థాలు
దీంతో కంపు కొడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల పక్కన ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలం క్రాస్ చేస్తు జాతీయ రహదారి 44 బైపాస్ నిర్మించారు. బైపాస్ రోడ్డు అటు వైపున గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డు ఉంది. ఇవతలి వైపు ఎలాంటి యార్డు లేకున్న అక్కడనే చెత్తను తీసుకు వచ్చి వేస్తున్నారు. దీంతో గాలి వీచినప్పుడు కళాశాలలోకి భరించ లేని దుర్వాసన వస్తోంది. చెత్తతో పాటు కోళ్ల వ్యర్థాలను తీసుకు వచ్చి అక్కడ వేస్తున్నారు. ఈ మధ్యనే బాల్కొండ మండల కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. జూనియర్ కళాశాల ఆవరణలోనే డిగ్రీ కళాశాలను ప్రారంభించారు.
ప్రస్తుతం చెత్తాచెదారంఎక్కడైతే వేశారో అటు వైపు ఉన్న గదుల్లోనే డిగ్రీ తరగతులను నిర్వహిస్తున్నారు. దీంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగింపజేయాలని కోరుతున్నారు.
పలుమార్లు ఫిర్యాదు చేశాం
కళాశాల పక్కన ఆవరణలో చెత్తను వేయడంతో వాసన భరించలేక పోతున్నామని పలు మార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పటికీ చెత్తను తొలిగించలేదు. వేయడం మానిపించ లేదు. చేసేది లేక ఊరుకున్నాం.
– చిన్నయ్య, ప్రిన్సిపాల్