CBA: ఫార్మేటివ్, సమ్మేటివ్‌తో పాటే సీబీఏ పరీక్షలు
ఈ మేరకు అక్టోబర్ 30న ఒక ప్రకటన విడుదల చేసింది. ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల్లోనే కొన్ని సీబీఏ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. సీబీఏ పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో అనుసరించే విధి విధానాలను కూడా ప్రకటించింది.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్
మూడు పరీక్షలు సీబీఏ విధానంలో..
2022లో కొత్తగా రెండు నిర్మాణాత్మక, ఒక సంగ్రహణాత్మక పరీక్షలను సీబీఏ పరీక్షలుగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. మిగిలిన రెండు నిర్మాణాత్మక, ఒక సంగ్రహణాత్మక పరీక్షలను పాత పద్ధతిలో నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు అవసరమయ్యే ముద్రణ, ప్యాకింగ్, రవాణా, జీఎస్టీ ఖర్చులు కలుపుకుని పేజికి నిర్ణీత మొత్తంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ ఖర్చును సమగ్ర శిక్ష ద్వారా జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డులకు ప్రభుత్వం అందిస్తుంది. వారి స్థాయిలో ముద్రణ వ్యవహారాలు నిర్ణయిస్తారు. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ప్రశ్నాపత్రాలు విద్యార్థుల్లోని ఉన్నత స్థాయి నైపుణ్యాలను వెలికితీసేలా ఉంటాయి. కనుక ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కూడా లబ్ధి పొందేలా ప్రభుత్వం వారికి కూడా ఈ ప్రశ్నాపత్రాలు అందించాలని నిర్ణయించింది. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ నిర్మాణాత్మక పరీక్షల ప్రశ్నాపత్రం సుమారు 10 నుంచి 20 పేజీల వరకు ఉండవచ్చు. కనుక 6 సబ్జెక్టులకు అన్ని పరీక్షలకు కలిపి వారి జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డుల నిర్ణయం మేరకు పేపర్ ధర, ముద్రణ, ప్యాకింగ్, రవాణా, జీఎస్టీ ఖర్చులు నిర్ధారించి వసూలు చేస్తారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
ప్రైవేట్ పాఠశాలలకు ఓఎమ్మార్ ఇవ్వరు
సాల్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉత్తమమైన అసెస్మెంట్‌లు అందించడం, వాటి విశ్లేషణ చేయడం, రేమిడియల్ బోధనకు సహకారం అందించేందుకు ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్‌తో ప్రభుత్వం ఒప్పదం కుదుర్చుకుంది. అందువల్ల ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డులు ఓఎమ్మార్ షీట్లను అందించడం లేదు.