Biometric Attendance: కాలేజీ విద్యార్థులకూ బయోమెట్రిక్
Sakshi Education
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో విద్యార్థులు సహా బోధన, బోధనేతర సిబ్బందికి Biometric Attendanceను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం అదేశించింది.
ఈ మేరకు అక్టోబర్ 12న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని సంస్థల్లో విధిగా బయోమెట్రిక్ అమలును అందుబాటు లోకి తేవాలని కొన్ని రోజుల క్రితమే అంతర్గత ఆదేశాలిచ్చి నట్టు అధికారులు తెలిపారు.
చదవండి: Tenth Class: విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ కోత్త ప్రణాళిక
ఈ–పాస్ దరఖాస్తుకు, ప్రభుత్వ ఉపకార వేతనా లతో పాటు వివిధ రకాల విద్యార్థి ప్రయోజనాలకు బయో మెట్రిక్ హాజరు తప్పనిసరని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
చదవండి: విద్యార్థులలో లోపించిన ఏకాగ్రత.. బ్రిడ్జి కోర్సు తీసుకువచ్చే ఆలోచనలో విద్యాశాఖ..
Published date : 13 Oct 2022 03:20PM