పాఠాలు చెప్పలేదు...వేతనం తీసుకోను! రూ.23.82 లక్షలు వాపసు..
BR Ambedkar Bihar Universityలోని Nitishwar Singh Collegeలో పనిచేసే అసిస్టెంట్ హిందీ Professor Lalan Kumar(33) కరోనా సమయంలో రెండేళ్ల 9 నెలల వేతనం, ఇతర అలవెన్సులకు సంబంధించి అందిన రూ.20 లక్షల వేతనం చెక్కును అధికారులకు పంపారు. ‘‘ఈ చెక్కును అంగీకరించాలంటూ అధికారులపై ఒత్తిడి చేయలేను. విద్యార్థులకు బోధించలేకపోయాను కాబట్టి, వేతనం తీసుకునే అర్హత లేదన్నది నా అభిప్రాయం’అని లలన్‌కుమార్ చెప్పారు. ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2019లో నిర్వహించిన పరీక్షలో టాప్–20లో నిలిచాను. కానీ, నాకు పేరులేని కళాశాలలో పోస్టింగిచ్చారు. నా కంటే తక్కువ ప్రతిభావంతులకు పీజీ విభాగాల్లో పోస్టింగులివ్వడం బాధ కలిగించింది’అని అన్నారు. లలన్ కుమార్ నిర్ణయం ఆదర్శప్రాయంగా అనిపిస్తున్నప్పటికీ, అతడి చెక్కును తిరిగి తీసుకునేందుకు ఎటువంటి నిబంధనలు లేవని వర్సిటీ ప్రొ–వైస్ చాన్సెలర్ ఆర్‌కే ఠాకూర్ తెలిపారు. ‘పేరున్న మరో కాలేజీకి బదిలీ చేయాలంటూ కుమార్ అనేక విజ్ఞాపనలు పంపారు. కానీ, అది పైస్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం’అని చెప్పారు. తరగతులకు విద్యార్థులు హాజరు కావడం లేదంటూ కుమార్ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. సదరు కళాశాల ప్రిన్సిపల్ మనోజ్‌కుమార్ దీనిపై స్పందించారు. ‘‘కరోనా మహమ్మారి సమయంలోనూ బోధన ఆన్‌లైన్‌లో సాగింది. ప్రస్తుతం వందలాది మంది విద్యార్థులు కాలేజీకి వస్తున్నారు. విద్యార్థులు లేని విషయం అతడు ఎన్నడూ నాతో చెప్పలేదు. వేతనం వాపసు విషయం మీడియా ద్వారానే తెలిసింది’అని పేర్కొన్నారు. ఇలా ఉండగా, కళాశాలకే చెందిన అరుణ్ కుమార్ అనే లెక్చరర్ కూడా వేతనం తిరిగి ఇచ్చేస్తానంటూ ప్రొవీసీకి లేఖ రాసినట్లు సమాచారం. ఇవన్నీ బెదిరించేందుకు చేస్తున్న యత్నాలంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు.