10th class విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు
- ఈ ఏడాదికి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం
- 19 వరకు దరఖాస్తు గడువు
- జూలై 6 నుంచి 15 వరకు పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు తమ మార్కులను ఇంకా మెరుగుపర్చుకోవడానికి వీలుగా బెటర్‌మెంట్ పరీక్ష రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కలి్పంచింది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ బుధవారం మెమో జారీ చేశారు. ఫెయిలైన విద్యార్థులకు నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు ఈ బెటర్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే 49, అంతకంటే తక్కువ మార్కులు వచి్చన ఏవైనా రెండు సబ్జెక్టుల్లో మాత్రమే విద్యార్థులు ఈ బెటర్‌మెంట్ పరీక్షలు రాసుకునేందుకు వీలు కలి్పస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెటర్‌మెంట్ పరీక్షలకు ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున రెండింటికీ కలిపి రూ.1,000 చెల్లించాలన్నారు. దరఖాస్తు చేసిన సమయంలోనే పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఆయా స్కూళ్ల లాగిన్‌ల ద్వారా బెటర్‌మెంట్ పరీక్షలకు ఈ నెల 19లోగా దరఖాస్తు చేయాలన్నారు. బెటర్‌మెంట్ పరీక్షలు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు జూలై 6 నుంచి 15 వరకు జరగనున్నాయి.
Also read: Good News: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త