Prof. R Limbadri: బెంగళూరు కాలేజీల్లోనూ బోలెడు సమస్యలు
National Assessment and Accreditation Council (NAAC) గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే కాలేజీలను ఇతర రాష్ట్రాల అధికారులతో పర్యవేక్షించేలా చేస్తారు. ఈ విధులను నిర్వర్తించేందుకు రెండు రోజుల పాటు బెంగళూరు వెళ్ళిన లింబాద్రి అక్కడి పరిస్థితులను అక్టోబర్ 20న మీడియాతో పంచుకున్నారు.
చదవండి: RGUKT: బాసర ట్రిపుల్ఐటీకి న్యాక్ ఇచ్చిన గుర్తింపు ఇదే..
కర్ణాటకలో దశాబ్దాల చరిత్ర ఉన్న కాలేజీలున్నాయని, తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి విద్యార్థులు వెళ్తుంటారని గుర్తు చేశారు. కోవిడ్ తర్వాత ఇప్పుడు ఆ కాలేజీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. న్యాక్ గుర్తింపునకు మౌలిక వసతులు, ఫ్యాకల్టి, విద్యా ప్రమాణాలే కీలకమని, కోవిడ్ నేపథ్యంలో ఇవి చాలెంజ్‌గా మారాయన్నారు. కోవిడ్ వచ్చిన వారు ఇంకా ఏదో సమస్యతో బాధపడటం కని్పంచిందనీ ఇవన్నీ నాణ్యమైన విద్యపై ప్రభావం చూపే అంశాలుగా ఆయన పేర్కొన్నారు.
చదవండి: NAAC: పారితోషికం రూ.లక్ష ఇస్తామన్నా ఆసక్తి చూపని యాజమాన్యాలు