గిరిజన క్రీడా పాఠశాలల్లో కోచ్ల నియామకం
గిరిజన విద్యా సంస్థల్లోని విద్యార్థులకు క్రీడల్లో ఉత్తమ శిక్షణ ఇచ్చేందుకు శాప్ 23 మంది కోచ్‌లను నియమించింది. విజయవాడ శాప్ కార్యాలయంలో డిసెంబర్ 4న కోచ్‌లకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఇందులో అథ్లెటిక్స్‌కు 6, ఆర్చరీ 4 , బాస్కెట్ బాల్ 1, వాలీబాల్ 2, జూడో 1 , హాకీ 2, వెయిట్ లిఫ్టింగ్ 2, బాక్సింగ్ 2, ఫుట్‌బాల్ 2, టేబుల్ టెన్నిస్‌కు ఒక కోచ్ చొప్పున నియమించింది.
చదవండి: 150 మంది గిరిజన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరు గిరిజన పాఠశాలల్లో 23 మంది కోచ్‌లను నియమించడం ఒక చరిత్ర అని, నియామకాలు చేపట్టిన శాప్‌ని, గిరిజన శాఖను ఆమె అభినందించారు. రాష్ట్రంలో 378 గిరిజన పాఠశాలలుంటే స్పోర్ట్స్ స్కూల్ ఒక్కటే ఉందని, ఇప్పుడు ఆరు పాఠశాలలను గుర్తించి 600 మంది గిరిజన పిల్లలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Good News: రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్లు శాతం ఇలా...