KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు దరఖాస్తులు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య, దంత వైద్య కళాశాలల్లో MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం Kaloji Narayana Rao University of Health Sciences (KNRUHS) అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేసింది.
జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్–2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. అక్టోబర్ 19 నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది.
చదవండి: మెడికల్ అడ్మిషన్లు రద్దయిన విద్యార్థులకు ఊరట
ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారని పేర్కొంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారం కోసం www.knruhs.telangana.gov.inలో చూడాలని యూనివర్సిటీ సూచించింది.
చదవండి: KNRUHS: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
Published date : 20 Oct 2022 03:16PM