DEO Yadaiah: విద్యార్థులకు ‘అపార్’
ఒకే దేశం.. ఒకే ఐడీ కార్డు పేరుతో ప్రతీ విద్యార్థికి 12 అంకెలతో కూడిన అపార్ (ఏపీఏఏఆర్– ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజస్ట్రీ) అందించనున్నారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు సంబంధించి ధృవపత్రాలు సమర్పించడం, మెమోలు జాగ్రత్త చేసుకోవడం చూస్తుంటాం.
ఒక్కో స్థాయిలో విద్యార్థికి ఒక్కో ఐడీ క్రియేట్ అవుతుంటాయి. ఈనేపథ్యంలో కేజీ నుంచి పీజీ వరకు ఒకే ఐడీ ఉండాలని ఆధార్ తరహా అపార్ కార్డులు మంజూరు చేయాలని కేంద్ర విద్యావనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా శనివారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు.
చదవండి: Kids: పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..
చైల్డ్ ఇన్‌ఫో ద్వారా..
జిల్లాలో 1,084 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,29,386 మంది విద్యార్థులు చదువుతున్నారు. పిల్లలకు పాఠశాలస్థాయిలో చైల్డ్ ఇన్‌ఫ్లో ద్వారా ఒక ఐడీ కేటాయించనున్నారు. కళాశాల స్థాయిలో మరో ఐడీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ తీసుకురానున్న అపార్ కార్డులోనే పూర్తి సమాచారం అందనుంది. అపార్డ్ కార్డు ద్వారా విద్యార్థులకు కేటాయించే సంఖ్యను విద్యార్థి జీవిత కాలం ఐడీగా పరిగణించనున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులందరికీ అపార్ కార్డు ఇవ్వనున్నారు. విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. కేజీ టూ పీజీ విద్యాసంవత్సరం వివరాలు, సాధించి విజయాలు, సాల్కర్‌షిప్‌లు, మెమోలు, ధ్రువపత్రాలు, ఆధార్ అనుసంధానం, కుటుంబ వివరాలు పొందుపరుస్తారు. అన్ని వివరాలు కార్డులో నిక్షిప్తం చేయడం వలన ఏదైనా ఎంట్రన్స్ పరీక్ష దరఖాస్తుకు అపార్ సంఖ్య కేటాయిస్తే సరిపోతుందని తెలుస్తోంది.
తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి..
అపార్ కార్డు పొందేందుకు తల్లిదండ్రుల అంగీకారం పత్రం తప్పనిసరి. జిల్లాలో సర్కారు బడుల్లో శనివారం పేరెంట్స్ టీచర్ మీటింగ్‌లో అపార్ కార్డుపై చర్చించారు. అపార్డ్ కార్డు ప్రాముఖ్యతపై వివరించారు. కొంత మంది తల్లిదండ్రులు అపార్ కార్డు కోసం అంగీకార పత్రం అందించినట్లు అధికారులు చెబుతున్నారు.