SP Sunpreet Singh: విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు
Sakshi Education
సూర్యాపేట టౌన్: అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆగస్టు 9న ఓ ప్రకటనలో తెలిపారు.
తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది అమానుష చర్యని, తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్థి లక్ష్యం కాదని పేర్కొన్నారు.
చదవండి: Warangal CP Kishore Jha: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.. స్టూడెంట్స్ ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి
విద్యార్థులు సీనియర్స్, జూనియర్స్ అనేతేడా లేకుండా స్నేహపూర్వకంగా కలిసిమెలిసి విద్యనభ్యసించాలని సూచించారు. ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఇరుక్కుంటే బంగారు భవిష్యత్తు కోల్పోతారని పేర్కొన్నారు. ర్యాగింగ్ కు పాల్పడే వారి వివరాలను డయల్ 100 కు తెలియజేసి పోలీసు సహాయం పొందవచ్చని కోరారు.
Published date : 10 Aug 2024 03:31PM