Dr G Rameswara Rao: చదువుతోపాటు నైపుణ్యం పెంచుకోవాలి
గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌తో కలిసి ‘లెవల్–04–స్టాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్’ పేరిట నవంబర్ 3న నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాజరైన డాక్టర్ రామేశ్వరరావు మాట్లాడుతూ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకత్వంలో భారత నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ(ఎంఎస్‌డీఈ)పీఎంకేవివై 4.0 కింద స్పాన్సర్ చేసిన ఫ్లాగ్‌షిప్‌తో ఈ శిక్షణ సాధ్యమైందన్నారు.
చదవండి: Andhra Pradesh: విద్యార్థినులకు ‘స్వేచ్ఛ’తో భరోసా
విద్య, పరిశ్రమల ఽమధ్య అంతరాన్ని తగ్గించడానికి ఎస్కీ, మల్లారెడ్డి కళాశాల సంయుక్తంగా కృషి చేస్తున్నాయన్నారు. పీఎంకేవివై 4.0 ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ రంగంలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, విజ్ఞానంతో విద్యార్థులను సన్నద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. మల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్, ఎంఆర్‌ఈసీ హెడ్ డాక్టర్ వి.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.