ఏఎంసీలో 15 పీజీ సీట్ల పెంపునకు అనుమతి
Sakshi Education
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆంధ్ర వైద్య కళాశాల(ఏఎంసీ)లో 15 పోస్టు గ్రడ్యుయేట్ సీట్ల పెంపునకు అనుమతి వచ్చినట్లు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిరాజు తెలిపారు.
రేడియాలజీ, బయో కెమిస్ట్రీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్ తదితర విభాగాల్లో పెరిగిన సీట్లకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఏఎంసీలో 38 వైద్య విభాగాల్లో 237 పీజీ సీట్లు ఉన్నాయి.
చదవండి: నాన్ క్లినికల్ పీజీ... నాట్ ఇంట్రెస్టెడ్!
ఈడబ్ల్యూఎస్ కోటా నేపథ్యంలో ఏఎంసీలో 131 పీజీ సీట్లు పెంపునకు ప్రతిపాదించారు. వీటితో కలిపితే పీజీ సీట్ల సంఖ్య 368కి చేరుతుంది. సీట్ల పెంపు విషయమై ఫిబ్రవరి 12వ తేదీన జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) బృందం ఏఎంసీలోని విభాగాలను, కేజీహెచ్‌లో వార్డులను తనిఖీ చేసింది. వసతులు, మౌలిక సదుపాయాలను పరిశీలించింది. తొలి విడతగా 15 పీజీ సీట్లకు అనుమతిచ్చింది.
Published date : 06 Feb 2023 03:37PM