American International Group: వైద్య శిక్షణలో ఏఐజీ ముందంజ
జూలై 25న జాన్సన్ అండ్ జాన్సన్ సహకారంతో రూపొందించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్జికల్ ట్రైనింగ్ ఆన్ వీల్స్ పేరిట అందుబాటులోకి తీసుకువచ్చిన అత్యాధునిక వాహనం ద్వారా రెండు వేల మంది శస్త్రచికిత్స నిపుణులకు శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ వాహనం దక్షిణ భారత రాష్ట్రాల్లోని 14 నగరాలకు చెందిన 28 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలను కలుపుకుంటూ 100 రోజుల ప్రయాణిస్తుందన్నారు.
ఆయా ప్రాంతాల్లో వైద్యులకు ఏఐజీ ఫ్యాకల్టీ, నిపుణులు మరింత మెరుగైన వైద్య చికిత్సలకు తగిన చిట్కాలు అందిస్తారన్నారు. ఈ వాహనాన్ని ప్రత్యేకంగా సర్జికల్ కమ్యూనిటీకి సంబంధించి పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించామని, సాధారణ, జీఐ, ఆర్థోపెడిక్, కేన్సర్, కార్డియాక్ సర్జన్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబడుతుందన్నారు. డాక్టర్ జి.వి.రావు మాట్లాడుతూ.. ఇది మారుమూల ప్రాంతాలకే కాకుండా, తక్కువ సేవలందించే ప్రాంతాలలో సైతం ప్రయాణించి, అధునాతన శిక్షణా అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జేఅండ్‌జే మెడ్‌టెక్ ఇండియా ఎండి అనూజ్ విర్మన్, తదితరులు పాల్గొన్నారు.