Education News: 60 రోజుల ప్రత్యేక ప్రణాళిక.. ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి..!
ప్రకాశం భవనంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, జూనియర్‌కాలేజీలు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో డిసెంబర్ 14న (గురువారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుంచి జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు సిద్ధం చేసిన 60 రోజుల ప్రత్యేక ప్రణాళికను అన్నీ కాలేజీల్లో పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రణాళికను సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా అనే అంశాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Education News: పదో తరగతిలో మెరుగైన ఉత్తీర్ణతే లక్ష్యం.. మొదలైన వంద రోజుల ప్రణాళిక.. ఎక్కడంటే..
జిల్లాలో ప్రతి కాలేజీలో 80 శాతం ఉత్తీర్ణత ఉండాలన్నారు. లేకుంటే కాలేజీల ప్రిన్సిపాల్, బోధనా సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించాలన్నారు. మెరిట్ విద్యార్థులు ర్యాంకులు సాధించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. పరీక్షలకు ముందు పేరెంట్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల చదువు తీరును తెలియచేయాలన్నారు.
సమావేశం అనంతరం అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరుపున ఖోఖో, చపక్‌తక్రా, బేస్‌బాల్, క్రీడల్లో జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో ఆర్‌ఐఓ సైమన్‌విక్టర్, డీఐఈఓ శ్రీనివాసరావు, స్కూల్‌గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి ఆదినారాయణ, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
Education News: విద్యార్థులు చదవడం, రాయడంపై పట్టు సాధించాలి..