ఆసిఫాబాద్‌అర్బన్: మండల కేంద్రానికి చెందిన యువకులు బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగాలు సాధించడంతో వారిని మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 22న ఘనంగా సన్మానించారు.
ఉద్యోగాలు పొందిన యువకులకు సన్మానం
ఇటీవల విడుదలైన ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన యువకులు పిడుగు మణికంఠ(సీఐఎస్‌ఎఫ్), గజ్జెల అక్షయ్(బీఎస్‌ఎఫ్), సాయి(సీఐఎస్‌ఎఫ్), ఉమెర్(బీఎస్‌ఎఫ్)లు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సంఘం జిల్లా నాయకులు మిట్ట తిరుపతి, ఆశన్న, వెంకటేశం, గణపతి, సతీష్‌కుమార్, గోపాల్, పోషన్న, తిరుపతి, చైతన్య, హరిప్రియ, సువర్ణ, మంజుల, సునీత, వాణి పాల్గొన్నారు.