15.62 లక్షల ఉద్యోగాలు ఖాళీ
దేశంలో ఉద్యోగ ఖాళీలపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 9న శాసనసభలో బడ్జెట్‌పై చర్చ అనంతరం ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూనే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. హరీశ్‌రావు ప్రసంగం ఆయన మాటల్లోనే..
మేం భర్తీ చేస్తున్నాం.. మీరూ నింపండి
‘‘రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాలను నింపుతామని మేం ప్రకటన చేశాం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు లక్షలాది ఖాళీలను నింపదు? కేంద్రం కూడా వెంట నే ఉద్యోగాల భర్తీ చేపట్టాలి. రాష్ట్రంలో ప్రతీ ఒక్క ఖాళీ పోస్టును నింపాలని భావిస్తున్నాం. కొత్త పోస్టులను సృష్టించాం. ఒక్కో కొత్త మెడికల్ కాలేజీలో 1,500 కొత్త పోస్టులు వచ్చాయి. కొత్త మండలాలు, డీపీవో ఆఫీసుల్లోనూ కొత్త పోస్టులను సృష్టించి నింపుతున్నాం. ఆ మేరకు 80 వేలు నింపుతున్నాం.
చదవండి:
80,039 Jobs: వెంటనే నోటిఫికేషన్లు
TS CM KCR: నేడు కీలక ప్రకటన.. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనున్న కేసీఆర్ ?