Skip to main content

IAF Jobs: ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

పాల్వంచరూరల్‌: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల కోసం విద్యార్థులు ఫిబ్ర‌వ‌రి 11వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధి కారి టి.సీతారాం సూచించారు.
Apply for Airforce Jobs    Indian Air Force recruitment    Indian Air Force

మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్ర‌వ‌రి 9న‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉపాధి అవకాశాలపై అధికారులు కె.రాజేష్‌, దేవకాంత మిశ్రా అవగా హన కల్పించారు. అర్హత కలిగిన విద్యార్థులు అగ్ని పథ్‌, వాయు విభాగంలో చేరేందేకు https//:agnipathvayu.cdac.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

చదవండి: Agnipath: యువతకు అగ్నిపథ్‌ మంచి అవకాశం.. ఈ నైపుణ్యం చూపిన వారిని నేరుగా సైన్యంలోకి

ఈ సమావేశంలో జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి సులోచనారాణి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై.చిన్నప్పయ్య, ఎస్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ హవిళ, సూపరింటెండెంట్‌ ఆర్‌.ఉదయ్‌కుమార్‌, తిరుమలరావు పాల్గొన్నారు.

Published date : 10 Feb 2024 03:46PM

Photo Stories