Skip to main content

CBSE 12th Result 2022 Link : సీబీఎస్‌ఈ 12వ తగరతి ఫలితాలు విడుదల.. ఈ వెయిటేజీ మార్కులను కలిపి..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు విడుదలచేసింది.
CBSE 12th Results
CBSE 12th Result 2022

ఈ ప‌లితాల‌ను జూలై 22వ తేదీ ఉద‌యం విడుదలయ్యాయి. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో మొత్తం 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత 3.29శాతం ఎక్కువగా ఉంది. ఈ ఏడాది పరీక్షల్లో అమ్మాయిలు 94.54 శాతం, అబ్బాయిలు 91.25శాతం పాసయ్యారు. 33వేల మందికి పైగా విద్యార్థులు 95శాతానికి పైగా స్కోరు సాధించారు. 1.34లక్షల మందికి 90శాతానికి పైనే మార్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాంతాల వారీగా అత్యధికంగా తిరువనంతపురంలో 98.83శాతం, బెంగళూరులో 98.16శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు  నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.

సీబీఎస్‌ఈ 12వ తగరతి ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఫ‌లితాల‌ను కోసం..
విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ రిజల్ట్స్‌ను చెక్‌చేసుకోవచ్చు. తమ రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్, అడ్మిట్‌ కార్డ్‌ ఐడీని ఎంటర్‌ చేసి స్కోరుకార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వీటితో పాటు డిజిలాకర్‌ , పరీక్షా సంగమ్ వెబ్‌సైట్‌ ద్వారా కూడా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో సంస్కరణలు ఇవే.. ఈ సారి మాత్రం..

How to check CBSE Class 12 result term 2 results?
➤ Visit the official website, cbseresults.nic.in.
➤ Click on the ‘CBSE Class 12 result 2022’ link.
➤ Enter board roll number, date of birth, and school number.
➤ Click on the ‘Submit’ button.
➤The online CBSE 12th Class result 2022 will be displayed on the screen.
➤ Download and keep it safe for future use.

ఈ వెయిటేజీ మార్కులు కలిపి తుది ఫలితాలను..
2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి బోర్డు ప్రత్యేక మదింపు విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అకాడమిక్‌ సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించి టర్మ్‌ 1, టర్మ్‌ 2 పరీక్షలు నిర్వహించారు. టర్మ్‌ 1 పరీక్షలను మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో, టర్మ్‌ 2 పరీక్షలను వ్యాసరూప, సంక్షిప్త సమాధాన ప్రశ్నల రూపంలో నిర్వహించారు. టర్మ్‌ 1 పరీక్షల నుంచి 30 శాతం మార్కుల వెయిటేజీ, టర్మ్‌ 2 పరీక్షల నుంచి 70శాతం మార్కుల వెయిటేజీ కలిపి తుది ఫలితాలను విడుదల చేసినట్లు బోర్డు వెల్లడించింది.

Published date : 22 Jul 2022 01:06PM

Photo Stories