ఉపాధికి వెలుగు రేఖలు..వృత్తి విద్య కోర్సులు
Sakshi Education
ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.. పది పూర్తయితే చాలు ఇంటర్మీడియెట్ స్థాయిలో చాలా మంది ఎంపిక చేసుకునే గ్రూపులివి! ఉన్నత విద్యా కోర్సుల్లో చేరి, నచ్చిన కెరీర్‌ను అందుకునేందుకు బాటలు వేసే గ్రూపులివి! అయితే పది తర్వాత రెండేళ్లకే పదిలమైన ఉపాధిని అందించే కోర్సులు ఒకేషనల్ కోర్సులు. విద్యార్థికి ప్రత్యేక వృత్తి నైపుణ్యాలు అందించి, కోర్సు పూర్తయిందే తడవు ఉద్యోగాన్ని లేదంటే స్వయం ఉపాధిని అందించే ఇంటర్ ఒకేషనల్ కోర్సులపై స్పెషల్ ఫోకస్...
ఇంటర్ ఒకేషనల్ కోర్సుల లక్ష్యాలు
కోర్సు పూర్తిచేసిన తర్వాత పరిశ్రమ లేదా సంస్థలో కొంతకాలం పాటు శిక్షణ పొందడాన్ని అప్రెంటీస్‌షిప్ అంటారు. ఇది పని అనుభవం ద్వారా మరింతగా నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఒకేషనల్ కోర్సు పూర్తయ్యాక అప్రెంటీస్కోసం రెండేళ్లలోపు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం నిర్వహించే అప్రెంటీస్మేళాల్లోనూ అవకాశం పొందొచ్చు. ఏడాదిపాటు ఉండే అప్రెంటీస్ పీరియడ్‌లో అభ్యర్థులకు విద్యార్థి వేతనం (స్టైఫండ్) లభిస్తుంది. మంచి ప్రతిభ కనబరిచి, యాజమాన్యం దృష్టిలోపడితే అదే సంస్థలో శాశ్వత ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి.
వేతనాలు
ఇంటర్ వొకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలు ఉంటాయి. ఆ తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా వేతనాలు పెరుగుతాయి. స్వయం ఉపాధి ద్వారా అధిక మొత్తాలను ఆర్జించవచ్చు. మరికొందరికి ఉపాధిని చూపించవచ్చు.
ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం
ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఒకేషనల్ కోర్సులకు కొత్త కరిక్యులం రూపొందించి, 2012-13 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. ఏ ఒకేషనల్ కోర్సుకైనా ప్రాక్టికల్స్ కీలకం. కాబట్టి కోర్సులో భాగంగా థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కుల వెయిటేజీ కూడా థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమానంగా ఉంటుంది. అంటే.. 50 శాతం మార్కులు థియరీకి, 50 శాతం మార్కులు పాక్టికల్స్‌కు ఉంటాయి. ఒకేషనల్ కోర్సులో జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఫౌండేషన్ కోర్సు సబ్జెక్టులుంటాయి. కళాశాల వీలునుబట్టి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
ఇంటర్ ఒకేషనల్ కోర్సుల లక్ష్యాలు
- +2 స్థాయిలో విద్యార్థులకు వివిధ వృత్తులకు సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాలను అందించి, ఉద్యోగావకాశాలు లేదా స్వయం ఉపాధిని పొందేలా చేయడం.
- ఉత్పాదకత, ఆర్థికాభివృద్ధి, వ్యక్తిగత శ్రేయస్సులను అనుసంధానించడం.
- వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో వృద్ధి పథంలో పయనిస్తున్న విభాగాలకు అవసరమైన మధ్యస్థాయి మానవ వనరులను సృష్టించడం.
తక్షణ ఉపాధికి సత్వర మార్గం:
పదో తరగతి పూర్తయిన తర్వాత ఐదారేళ్ల పాటు విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇ లాంటి వారికి తక్షణం ఉపాధి కల్పించే కోర్సులు అవసరం. మరోవైపు నేటి ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సిబ్బందికి డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో ఇంటర్ ఒకేషనల్ కోర్సులు యువతను ఆకట్టుకుంటున్నాయి.
అర్హత, కోర్సులు: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతోంది. ఔత్సాహిక విద్యార్థులు నేరుగా కాలేజీని సంప్రదించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులు
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ఒకటి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని భారత్‌లో కంపెనీలు తేలికపాటి, భారీ వాహనాలను పెద్ద ఎత్తున తయారుచేస్తున్నాయి. దీంతో సర్వీసింగ్, మరమ్మతులు, నిర్వహణ విభాగాల్లో మధ్యస్థాయి టెక్నీషియన్లకు డిమాండ్ పెరిగింది.
కరిక్యులం: వర్క్‌షాప్ టెక్నాలజీ, బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్, ఆటో ట్రాన్స్మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఆటో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్..
ఉద్యోగావకాశాలు: ఆటో మెకానిక్, వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్/మ్యానుఫ్యాక్చర్ రిప్రెజెంట్, ఇన్సూరెన్స్ అండ్ లాస్ అసెసర్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, ఆటో ఎలక్ట్రీషియన్.
స్వయం ఉపాధి: ఆటోమొబైల్ మెకానిక్, డీజిల్ ఫ్యూయల్ సిస్టమ్ సర్వీస్ మెకానిక్, వెహికల్ ఆపరేటర్, స్పేర్ పార్ట్స్ సేల్స్‌మ్యాన్-డీలర్.
మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:
ఉద్యోగావకాశాలు: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మెకానికల్ విభాగాలు; ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; రిఫ్రిజిరేషన్, ఎయిర్కండీషనింగ్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; వర్క్‌షాప్ టెక్నీషియన్; పవర్ప్లాంట్ల టెక్నీషియన్; సోలార్ సిస్టమ్ టెక్నీషియన్.
స్వయం ఉపాధి: సోలార్ ప్లాంట్లు, బయోగ్యాస్ ప్లాంట్ల నిర్వహణ; వెల్డింగ్ వర్క్‌షాప్; లైట్ మోటార్ వెహికల్ సర్వీసింగ్ సెంటర్; జనరల్ వర్క్‌షాప్.
ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్; డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:
ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అసెంబ్లీస్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ టెస్టర్-రిపైరర్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ సేల్స్ అండ్ సర్వీస్.
స్వయం ఉపాధి: ఎలక్ట్రానిక్ పరికరాల సర్వీసింగ్, ఎలక్ట్రానిక్ పరికరాల డీలర్షిప్/ఏజెన్సీ, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి.
ఎలక్ట్రికల్ టెక్నీషియన్:
ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రిక్ ఉపకరణాల అసెంబ్లర్, టెస్టర్, ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, రిపైరర్, వైండర్/రివైండర్ (మోటార్), సేల్స్‌మ్యాన్.
స్వయం ఉపాధి: ఎలక్ట్రిక్ ఉపకరణాల డీలర్షిప్/ఏజెన్సీ; రిపైర్ షాప్; మ్యానుఫ్యాక్చరింగ్; ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్; ఎలక్ట్రీషియన్; వైర్‌మ్యాన్; సర్వీస్ టెక్నీషియన్/సర్వీస్ ఇంజనీర్.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్:
ఉద్యోగావకాశాలు: జూనియర్ ప్రోగామర్, కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, సాఫ్ట్వేర్ మార్కెటింగ్ పర్సనల్, కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ అసిస్టెంట్, డ్రాఫ్టింగ్ అసిస్టెంట్స్.
స్వయం ఉపాధి: డీటీపీ ఆపరేటర్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ సెంటర్ మెయింటెనెన్స్, ఇమేజ్ అండ్ వీడియో ఎడిటింగ్, బేసిక్ హార్డ్‌వేర్ అండ్ ట్రబుల్ షూటింగ్ టెక్నీషియన్, వెబ్‌డిజైనర్.
కన్స్ట్రక్షన్ టెక్నాలజీ:
ఉద్యోగావకాశాలు: నిర్మాణ రంగంలో ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లకు అసిస్టెంట్లు; కాంట్రాక్ట్ ఉద్యోగాలు; తాపీమేస్త్రీ, కార్పెంటర్, పెయింటర్ వంటివి.
స్వయం ఉపాధి: నిర్మాణ సామగ్రి సరఫరా కాంట్రాక్టర్; పెయింటింగ్, బార్ బెండింగ్ వంటి సేవలు.
అగ్రికల్చరల్ కోర్సులు
క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్:
భూ, నీటి వనరులు క్షీణిస్తుండటం.. వాతావరణ మార్పులు, జనాభా వృద్ధి నేపథ్యంలో దేశంలో పంట ఉత్పత్తుల్లో నిలకడ వృద్ధి సాధించడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో విద్య, శిక్షణ, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, సంస్థాగతపరమైన సహకారంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ వృత్తి విద్యా నిపుణుల అవసరం పెరుగుతోంది.
ఉద్యోగాలు: ఫీల్డ్ అసిస్టెంట్, ఫార్మ్ అసిస్టెంట్, ఫీల్డ్ మ్యాన్, అగ్రికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, విలేజ్ కోఆర్డినేటర్, ప్లాంట్ ప్రొటక్షన్ అసిస్టెంట్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, గ్రామీణ బ్యాంకుల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్..
స్వయం ఉపాధి: అగ్రీ ఇన్పుట్ సప్లయిర్; సీడ్ గ్రోవర్, క్రాప్ ప్రొడ్యూసర్, కస్టమ్ సర్వీస్, కాంట్రాక్టర్/కాంట్రాక్టింగ్ ఫార్మింగ్.
డెయిరీ:
ఉద్యోగావకాశాలు: వెటర్నరీ అసిస్టెంట్, డెయిరీ ఫారం అసిస్టెంట్; మిల్క్ ప్రొక్యూర్మెంట్ సూపర్వైజర్; డెయిరీ లేబొరేటరీ అసిస్టెంట్; ఫీడర్ ప్రొడక్షన్ సూపర్వైజర్; డెయిరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్..
స్వయం ఉపాధి: డెయిరీ ఫారం ఓనర్; డెయిరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్; ఫీడర్ ప్రొడ్యూసర్; మిల్క్ పార్లర్; మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్; మిల్క్ కలెక్షన్ సెంటర్.
ఫిషరీస్:
ఉద్యోగావకాశాలు: లేబొరేటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ మ్యాన్, సూపర్వైజర్; ఆక్వా కేంద్రాలు, హేచరీస్, ప్రాసెసింగ్ ప్లాంట్లలో లేబొరేటరీ అసిస్టెంట్; ఫీల్డ్ మార్కెటింగ్ అసిస్టెంట్, సీడ్ ప్రొడక్షన్ అసిస్టెంట్, ఫిషరీస్ కోఆపరేటివ్ సంస్థలలో ఉద్యోగాలు, స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు.
స్వయం ఉపాధి: ఫిషరీ ఇన్పుట్ సప్లయిర్, సీడ్ ప్రొడ్యూసర్, ఫిష్ ప్రొడ్యూసర్..
సెరీకల్చర్:
ఉద్యోగావకాశాలు: ఆపరేటివ్ (గ్రెయినేజ్/మల్బరీ కల్టివేషన్/ఎక్స్టెన్షన్/రియరింగ్/రీలింగ్); లేబ్ అటెండర్; కల్టివేటర్/లేబర్.
స్వయం ఉపాధి: మల్బరీ నర్సరీ, గ్రెయినేజ్, సెరీకల్చర్ సర్వీస్ సెంటర్, మల్బరీ గ్రోవర్, సిల్క్‌వార్మ్ సీడ్ సప్లయిర్, మల్బరీ ప్రోపగేటర్, సిల్క్ రీలర్, సిల్క్ ట్విస్టర్, కకూన్ సప్లయిర్.
హ్యుమానిటీస్, ఇతర కోర్సులు
కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్:
ఉద్యోగావకాశాలు: మీడియా సంస్థలలో యానిమేటర్‌గా అవకాశాలుంటాయి. డ్రాయింగ్ అసిస్టెంట్, ఫొటో ఎడిటింగ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు పొందొచ్చు. స్థానిక కేబుల్ టీవీ కేంద్రాలు, గేమింగ్ స్టూడియోల్లోనూ అవకాశాలుంటాయి.
టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్:
ఉద్యోగావకాశాలు: టూరిజం అసిస్టెంట్, టూరిస్ట్‌గైడ్, టూర్ ఎస్కార్ట్, గెస్ట్ రిలేషన్ అసిస్టెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్, హౌస్‌కీపింగ్ అసిస్టెంట్..
స్వయం ఉపాధి: కేటరింగ్ ఆపరేషన్స్, టూర్ కండక్టర్, కొరియర్ అండ్ కార్గో ఏజెంట్, టూరిస్ట్ గైడ్..
పారామెడికల్ కోర్సులు
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్:
వైద్య సేవల రంగంలో రోగ నిర్ధరణ కీలకమైంది. సరిగా రోగ నిర్ధరణ జరక్కుంటే రోగికి చికిత్స చేసేందుకు వీలుపడదు. ఈ నేపథ్యంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు.
కరిక్యులం: బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ అండ్ పాథాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ.
ఉద్యోగావకాశాలు: ఆసుపత్రుల రోగ నిర్ధారణ కేంద్రాలు; వైద్య, ఫార్మసీ కళాశాలలు; నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ లేబొరేటరీ, మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్స్ వంటివాటిలో లేబొరేటరీ టెక్నీషియన్లుగా అవకాశాలుంటాయి.
స్వయం ఉపాధి: డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ల ఏర్పాటు; ల్యాబ్ కెమికల్స్, గ్లాస్‌వేర్, ల్యాబ్ పరికరాలు, విడి భాగాల డిస్ట్రిబ్యూటర్.
ఇతర కోర్సులు: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్, ఫిజియోథెరఫీ.
బిజినెస్, కామర్స్ కోర్సులు
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్:
కరిక్యులం: బిజినెస్ ఆర్గనైజేషన్, అకౌంటెన్సీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్.
ఉద్యోగావకాశాలు: సూపర్ బజార్లు, షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, బ్యాంకుల్లో అవకాశాలుంటాయి. మ్యూచ్‌వల్‌ఫండ్స్ కంపెనీలు, సూక్ష్మ రుణ సంస్థల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు.
స్వయం ఉపాధి: పోస్టల్ సేవింగ్ ఏజెంట్లు, రికవరీ ఏజెంట్లుగా స్వయం ఉపాధి పొందొచ్చు. చిట్‌ఫండ్స్, సూక్ష్మరుణ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇతర కోర్సులు:
ఆఫీస్ అసిస్టెంట్‌షిప్
అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్
ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్
హోంసైన్స్ కోర్సులు
కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ:
దేశంలో గత పదేళ్ల నుంచి రెడీమేడ్ వస్త్ర పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. మారిన జీవనశైలి, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారులు కొత్త కొత్త డిజైన్ వస్త్రాలను కోరుకుంటున్నారు. మరోవైపు భారత్ రెడీమేడ్ వస్త్రాలకు దక్షిణ అమెరికా, జపాన్, మధ్యప్రాచ్య దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో గార్మెంట్ టెక్నాలజీ నైపుణ్యాలున్న వారికి అవకాశాలు పెరుగుతున్నాయి.
కరిక్యులం: ప్రిన్సిపుల్స్ ఆఫ్ గార్మెంట్ మేకింగ్, టెక్స్టైల్స్ సైన్స్, గార్మెంట్ కన్స్ట్రక్షన్, అపెరల్ మ్యానుఫ్యాక్చర్, ఫ్యాబ్రిక్ ఎస్టాబ్లిష్మెంట్, అపెరల్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్.
ఉద్యోగావకాశాలు: వస్త్ర పరిశ్రమలో ప్రొడక్షన్ సూపర్వైజర్లు; ఫ్లోర్ సూపర్వైజర్లు; ఫినిషింగ్ సూపర్వైజర్లు; అసిస్టెంట్ డిజైనర్లు; ఇన్స్ట్రక్టర్లు.
స్వయం ఉపాధి: గార్మెంట్ యూనిట్, బోటిక్, వస్త్ర ఎగుమతి సంస్థల కాంట్రాక్టులు.
ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్:
కరిక్యులం: ఫండమెంటల్స్ ఆఫ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్, ఫండమెంటల్స్ ఆఫ్ టెక్స్టైల్స్, ఫ్యాషన్ అండ్ అపెరల్ డిజైనింగ్, అడ్వాన్స్డ్ డ్రెస్ డిజైనింగ్, ట్రెడిషనల్ టెక్స్టైల్స్, ఫ్యాషన్ గార్మెంట్ డిజైనింగ్.
ఉద్యోగావకాశాలు: ఫ్లోర్ సూపర్వైజర్, అసిస్టెంట్ డిజైనర్, సోర్సింగ్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ప్యాటర్న్ మేకర్.
స్వయం ఉపాధి: బోటిక్, కాంట్రాక్ట్ పనులు, గ్రామీణ ప్రాంత ఔత్సాహికులకు శిక్షణ..
హోటల్ ఆపరేషన్స్:
ఉద్యోగావకాశాలు: హోటళ్లలో ఫ్లోర్ మేనేజర్/సూపర్వైజర్; కుక్‌లు, బేకరీ అసిస్టెంట్లు, కిచెన్ స్టీవార్డింగ్ అసిస్టెంట్. విమానాశ్రయాలు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, పరిశ్రమల్లో కేంటీన్లు వంటి వాటిలో అవకాశాలుంటాయి.
ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్:
కరిక్యులం: ఇంట్రడక్షన్ టు చైల్డ్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ క్రెచెస్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రిస్కూల్, పేరెంట్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్.
ఉద్యోగావకాశాలు: ప్లే స్కూల్ టీచర్, ప్రీ స్కూల్ టీచర్, అంగన్వాడీ వర్కర్, ప్రీ స్కూల్ సూపర్వైజర్, స్కూల్ కోఆర్డినేటర్.
స్వయం ఉపాధి: క్రెచ్, ప్రీ స్కూల్, ప్లే స్కూల్..
ఉన్నత విద్యావకాశాలు

- ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వొకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు బ్రిడ్జ్‌కోర్సు, ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. లేదంటే 10 శాతం కోటా కింద సంబంధిత పాలిటెక్నిక్ కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరొచ్చు. బీఏ, బీకామ్ కోర్సుల్లోనూ ప్రవేశించవచ్చు.
- హెల్త్ అండ్ పారామెడికల్ కోర్సులు చేసిన వారు బ్రిడ్జ్‌కోర్సు, ఎంసెట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మెడికల్ కోర్సుల్లో చేరొచ్చు.
- మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసిన వారు బీఎస్సీ ఎంఎల్‌టీలో చేరొచ్చు. కామర్స్, బిజినెస్ కోర్సులు పూర్తిచేసిన వారు బీఏ, బీకామ్ కోర్సుల్లో చేరొచ్చు. అగ్రికల్చర్, హోంసైన్స్ ఒకేషనల్ కోర్సులు చదివిన వారు బీఎస్సీ, బీఏ, బీకామ్ కోర్సుల్లో చేరేందుకు అర్హులు.
కోర్సు పూర్తిచేసిన తర్వాత పరిశ్రమ లేదా సంస్థలో కొంతకాలం పాటు శిక్షణ పొందడాన్ని అప్రెంటీస్‌షిప్ అంటారు. ఇది పని అనుభవం ద్వారా మరింతగా నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఒకేషనల్ కోర్సు పూర్తయ్యాక అప్రెంటీస్కోసం రెండేళ్లలోపు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం నిర్వహించే అప్రెంటీస్మేళాల్లోనూ అవకాశం పొందొచ్చు. ఏడాదిపాటు ఉండే అప్రెంటీస్ పీరియడ్‌లో అభ్యర్థులకు విద్యార్థి వేతనం (స్టైఫండ్) లభిస్తుంది. మంచి ప్రతిభ కనబరిచి, యాజమాన్యం దృష్టిలోపడితే అదే సంస్థలో శాశ్వత ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి.
వేతనాలు
ఇంటర్ వొకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలు ఉంటాయి. ఆ తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా వేతనాలు పెరుగుతాయి. స్వయం ఉపాధి ద్వారా అధిక మొత్తాలను ఆర్జించవచ్చు. మరికొందరికి ఉపాధిని చూపించవచ్చు.
ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం
ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఒకేషనల్ కోర్సులకు కొత్త కరిక్యులం రూపొందించి, 2012-13 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. ఏ ఒకేషనల్ కోర్సుకైనా ప్రాక్టికల్స్ కీలకం. కాబట్టి కోర్సులో భాగంగా థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కుల వెయిటేజీ కూడా థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమానంగా ఉంటుంది. అంటే.. 50 శాతం మార్కులు థియరీకి, 50 శాతం మార్కులు పాక్టికల్స్‌కు ఉంటాయి. ఒకేషనల్ కోర్సులో జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఫౌండేషన్ కోర్సు సబ్జెక్టులుంటాయి. కళాశాల వీలునుబట్టి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
తక్షణ ఉపాధికి మార్గాలు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల వ్యవధి గల ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. లేదంటే స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ఆసక్తి ఉన్నవారు ఉన్నత విద్యలోనూ అవకాశాలు పొందొచ్చు. కోర్సు పూర్తిచేసిన తర్వాత అప్రెంటీస్‌షిప్ చేయొచ్చు. ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుకల్పిస్తుంది. ఏటా ప్రభుత్వం అప్రెంటీస్‌షిప్ మేళాలు నిర్వహిస్తోంది. వీటిద్వారా అప్రెంటీస్‌షిప్ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. మా కాలేజీలో ఆఫీస్ అసిస్టెంట్‌షిప్ (ఓఏ) కోర్సు ఉంది. ఇందులో గతేడాది 30 మందికిపైనే చేరారు. స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులకు అధికారులు అనుమతిచ్చినప్పటికీ ఫ్యాకల్టీ కొరత ఉంది. ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు, విశ్రాంత సిబ్బందిని మాత్రమే ఫ్యాకల్టీగా తీసుకోవాలనే మార్గదర్శకాలు ఉన్నాయి. - పి.నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్, బాలికల కళాశాల, వనపర్తి, మహబూబ్‌నగర్. |
బంగారు భవిష్యత్‌కు వృత్తి విద్యా కోర్సులు యువతలో నిరుద్యోగితను తగ్గించేందుకు, తమ కాళ్లపై తాము నిలబడేందుకు జూనియర్ కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టారు. తక్షణ ఉపాధితో పాటు ఉత్సాహముంటే ఉన్నత విద్యను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులు దోహదపడతాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ వంటి కోర్సులున్నాయి. వీటిలో ఒక్కో కోర్సుకు 20 సీట్ల వరకు ఉంటాయి. అవసరమైతే డిమాండ్‌నుబట్టి 40 వరకు పెంచుకునేందుకు వీలుంది. ఒకేషనల్ కోర్సులు.. విద్యార్థులకు స్వయం ఉపాధి పరంగానూ మంచి అవకాశాలు కల్పించి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ప్రభుత్వ రంగంలో రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇన్ని అవకాశాలున్న వృత్తి విద్యా కోర్సులపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మరింత అవగాహన పెంపొందించాలి. - కేఎల్టీ మురళీమనోహర్, సీనియర్ ఫ్యాకల్టీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నెల్లిమర్ల, విజయనగరం. |
Published date : 04 Jul 2014 05:08PM