రూరల్ మేనేజ్‌మెంట్
Sakshi Education
ప్రస్తుతం ఉద్యోగాల కల్పనలో ఉవ్వెత్తున ఎగుస్తున్న స్పెషలైజేషన్ ఏదైనా ఉందంటే.. నిస్సందేహంగా అది రూరల్ మేనేజ్‌మెంటే! దీనికి సంబంధించిన కోర్సులు చదివిన అభ్యర్థులకు వరల్డ్ బ్యాంకు సహా ఇతర ప్రపంచ శ్రేణి సంస్థల్లో పనిచేసే అవకాశం లభిస్తోంది.
అయితే రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సుల పట్ల మన విద్యార్థుల్లో సరైన అవగాహన ఉండటంలేదు. ఈ నేపథ్యంలో రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సులు, అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
గ్రామీణ ప్రాంతాలు, సహకార సంఘాలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాల నిర్వహణ, ప్రణాళిక, నియంత్రణల గురించి అధ్యయనం చేయడాన్ని రూరల్ మేనేజ్‌మెంట్ అంటారు. రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రధానంగా మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను గ్రామీణ కోణంలో అన్వయించి బోధిస్తారు. రూరల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలను గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ, కేస్‌స్టడీస్ ద్వారా వాస్తవ పరిస్థితులకు అన్వయించి నేర్చుకుంటారు.
పెరుగుతున్న డిమాండ్
దేశంలో రూరల్ మేనేజ్‌మెంట్ రంగం పరిధి రోజురోజుకీ విస్తృతమవుతోంది. దేశ జీడీపీలో గ్రామీణ రంగం వాటా దాదాపు 50 శాతం. కాగా, మొత్తం దేశ జనాభాలో 70 శాతంగా, వర్క్‌ఫోర్స్‌లో 50 శాతం గ్రామీణ వాటానే ఉంది. రూరల్ మేనేజ్‌మెంట్ ద్వారా ప్రగతికి దూరమైన వర్గాలను అభివృద్ధివైపు నడిపించొచ్చు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర, సమ్మిళిత, పర్యావరణ స్నేహపూర్వక అభివృద్ధిని సాధించొచ్చు. దేశంలోని దాదాపు 4,000 బిజినెస్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏటా 30,000 మంది ఎంబీఏలను అందిస్తుంటే.. రూరల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్‌ల సంఖ్య మాత్రం 1000లోపే ఉంటోంది. దీంతో రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సులను పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ నెలకొంది. ప్రస్తుతం ఈ ఛాలెంజింగ్ కెరీర్‌ను ఎంచుకునే యువత సంఖ్య కూడా క్రమేణా పెరుగుతోంది.
ప్రత్యేకంగా..
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, మేనేజీరియల్ అనాలసిస్ అండ్ కమ్యూనికేషన్, ఫైనాన్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ తదితర సంప్రదాయ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లతో పోల్చితే రూరల్ మేనేజ్‌మెంట్ (ఎంబీఏ) పూర్తి భిన్నమైనది.
గ్రామీణ రంగం - విభాగాలు
కెరీర్ అవకాశాలు
రూరల్ కోర్సులను అందిస్తున్న కొన్ని సంస్థలు
ఐఆర్‌ఎంఏ
దేశంలో రూరల్ మేనేజ్‌మెంట్ విద్యను అందించడంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ (ఐఆర్‌ఎంఏ)కు మంచి పేరు ఉంది. దీన్ని 1979లో సహకార సంఘాలు, గ్రామీణాభివృద్ధి సంస్థలకు.. మేనేజ్‌మెంట్, శిక్షణ, పరిశోధన, కన్సల్టెన్సీ విభాగాల్లో సేవలందించేందుకు స్థాపించారు.
కోర్సులు:
100 శాతం ప్లేస్‌మెంట్స్
పెరుగుతున్న డిమాండ్
దేశంలో రూరల్ మేనేజ్‌మెంట్ రంగం పరిధి రోజురోజుకీ విస్తృతమవుతోంది. దేశ జీడీపీలో గ్రామీణ రంగం వాటా దాదాపు 50 శాతం. కాగా, మొత్తం దేశ జనాభాలో 70 శాతంగా, వర్క్‌ఫోర్స్‌లో 50 శాతం గ్రామీణ వాటానే ఉంది. రూరల్ మేనేజ్‌మెంట్ ద్వారా ప్రగతికి దూరమైన వర్గాలను అభివృద్ధివైపు నడిపించొచ్చు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర, సమ్మిళిత, పర్యావరణ స్నేహపూర్వక అభివృద్ధిని సాధించొచ్చు. దేశంలోని దాదాపు 4,000 బిజినెస్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏటా 30,000 మంది ఎంబీఏలను అందిస్తుంటే.. రూరల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్‌ల సంఖ్య మాత్రం 1000లోపే ఉంటోంది. దీంతో రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సులను పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ నెలకొంది. ప్రస్తుతం ఈ ఛాలెంజింగ్ కెరీర్‌ను ఎంచుకునే యువత సంఖ్య కూడా క్రమేణా పెరుగుతోంది.
ప్రత్యేకంగా..
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, మేనేజీరియల్ అనాలసిస్ అండ్ కమ్యూనికేషన్, ఫైనాన్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ తదితర సంప్రదాయ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లతో పోల్చితే రూరల్ మేనేజ్‌మెంట్ (ఎంబీఏ) పూర్తి భిన్నమైనది.
గ్రామీణ రంగం - విభాగాలు
- అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్
- రూరల్ ప్రొడక్షన్ అండ్ లైవ్లీహుడ్
- రూరల్ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ బ్యాంకింగ్
- నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ అండ్ క్లైమేట్ ఛేంజ్
- రూరల్ మార్కెటింగ్
- కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) మేనేజ్‌మెంట్
- మైక్రో ఫైనాన్స్
- ఇన్నోవేషన్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రైజెస్
- పాలసీ అండ్ ప్రోగ్రామ్ ఇంటర్‌వెన్షన్స్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్
- ఏంబీఏ రూరల్ మేనేజ్‌మెంట్‌ను పూర్తిచేయడం ద్వారా సాధారణ మేనేజ్‌మెంట్ విభాగాలతోపాటు పైన పేర్కొన్న గ్రామీణ సంబంధిత ప్రత్యేక విభాగాల్లోనూ కొలువులు అందుకోవచ్చు.
కెరీర్ అవకాశాలు
- రూరల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు కింది విభాగాల్లో కెరీర్ అవకాశాలు ఉంటాయి.
- గామీణ అవసరాలు, వసతులు.
- వ్యవసాయ, అనుబంధ పరిశ్రమల నిర్వహణ.
- సహకార సంఘాలు.
- వాతావరణ మార్పు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్).
- సహజ వనరుల నిర్వహణ.
- రూరల్ మార్కెటింగ్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.
రూరల్ కోర్సులను అందిస్తున్న కొన్ని సంస్థలు
- కేఐఐటీ స్కూల్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్, భువనేశ్వర్.
- జేవియర్ యూనివర్సిటీ, భువనేశ్వర్.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్‌చ, జైపూర్ క్యాంపస్‌లో రెండేళ్ల ఎంబీఏ రూరల్ మేనేజ్‌మెంట్, ఆరు నెలల వ్యవధితో ఆన్ రూరల్ లైవ్లీహుడ్స్ సర్టిఫికెట్ పోగ్రామ్ అందుబాటులో ఉన్నాయి.
వివరాలకు: www.iihmr.edu.in - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్, జైపూర్.. పీజీడీఎం రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సును ఆఫర్‌చేస్తోంది.
వివరాలకు: www.iirm.ac.in
ఐఆర్‌ఎంఏ
దేశంలో రూరల్ మేనేజ్‌మెంట్ విద్యను అందించడంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ (ఐఆర్‌ఎంఏ)కు మంచి పేరు ఉంది. దీన్ని 1979లో సహకార సంఘాలు, గ్రామీణాభివృద్ధి సంస్థలకు.. మేనేజ్‌మెంట్, శిక్షణ, పరిశోధన, కన్సల్టెన్సీ విభాగాల్లో సేవలందించేందుకు స్థాపించారు.
కోర్సులు:
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌ఎం)
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి.
ప్రవేశ విధానం
క్యాట్ 2018, ఎక్స్‌ఏటీ స్కోరు ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆయా అభ్యర్థులను ఐఆర్‌ఎంఏ సోషల్ అవేర్‌నెస్ టెస్ట్(శాట్), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. వీటిలో ప్రతిభచూపిన అభ్యర్థులకు తుది ప్రవేశాలు ఖరారు చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2018.
- ఫెలో ప్రోగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఆర్‌ఎం).
అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. జనరల్ అభ్యర్థులకు 55 శాతం, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. దీంతోపాటు క్యాట్ స్కోర్, ఎక్స్‌ఏటీ, జీమ్యాట్, జీఆర్‌ఈ, గేట్, యూజీసీ-జేఆర్‌ఎఫ్/నెట్, ఐకార్-ఎస్‌ఆర్‌ఎఫ్, ఐకార్/ఏఎస్‌ఆర్‌బీ-నెట్ స్కోరు ఉండాలి.
- ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (రూరల్).
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ తత్సమాన హోదా కలిగిన ఈ కోర్సును పూర్తిస్థాయి రెసిడెన్షియల్ కోర్సుగా అందిస్తున్నారు. కోర్సు వ్యవధి 15 నెలలు.
అర్హత: ఏదైనా డిగ్రీ. జనరల్ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వేషన్ కేటగిరీలకు 45 శాతం మార్కులు ఉండాలి. దీంతోపాటు క్యాట్ స్కోర్, ఎక్స్‌ఏటీ, జీమ్యాట్/మినీ జీమ్యాట్ స్కోరు ఉండాలి.
- సర్టిఫికెట్ ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్.
ఇది ఎగ్జిక్యూటివ్స్, ఆఫీసర్లకు ఉద్దేశించిన కోర్సు.
100 శాతం ప్లేస్‌మెంట్స్
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ (ఐఆర్‌ఎంఏ) 100 శాతం ప్లేస్‌మెంట్స్‌ను అందిస్తూ కొలువుల ఖిల్లాగా మారుతోంది. తాజాగా ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన వింటర్ ఇంటర్న్‌షిప్ ప్లేస్‌మెంట్స్‌లో వరల్డ్ బ్యాంకు సహా 110 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కంపెనీలు పీజీడీఆర్‌ఎం విద్యార్థులకు 404 ఇంటర్న్‌షిప్ ఆఫర్లను అందించాయి.
- ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్న కంపెనీల్లో గోద్రెజ్, పిడిలైట్, ఐటీసీ, అదానీ, ఇండస్‌ఇండ్, బిగ్ బాస్కెట్, రిలయన్స్ ఫౌండేషన్, ఫ్యూచర్ గ్రూప్, గ్రోఫెర్స్ అండ్ డిలైట్, అమూల్ తదితర ప్రముఖ కంపెనీలు ఉండటం గమనార్హం.
- ఎంపికైన అభ్యర్థులకు సరాసరి స్టైపెండ్ రూ.48,840 లభించగా.. అత్యధిక స్టైపెండ్ రూ.1.8 లక్షలుగా ఉంది.
- కంపెనీలు అగ్రిబిజినెస్, రూరల్ మార్కెటింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, సీఎస్‌ఆర్, సోషల్ బిజినెస్, డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్స్, కన్సల్టెన్సీ విభాగాల్లో అభ్యర్థులను నియమించుకున్నాయి.
- రిక్రూటర్లు ఐఆర్‌ఎంఏ విద్యార్థులు అర్బన్, రూరల్ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలను తగ్గించడంతో క్రియాశీలక పాత్ర పోషిస్తారని నమ్ముతున్నారు. అందుకే ఐఆర్‌ఎంఏలో విద్యార్థులకు ఆఫర్ లెటర్లు అందించేందుకు పోటీపడుతున్నాయి.
- ఐఆర్‌ఎంఏ ఫైనల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఫిబ్రవరి(2019) మొదటివారంలో జరగనున్నాయి.
- ఎన్‌జీవోలు, కోఆపరేటివ్స్, గవర్నమెంట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలతోపాటు వాణిజ్య రంగానికి సంబంధించి ప్రైవేటు కంపెనీలు, కార్పొరేట్, ఎంఎన్‌సీల్లో అవకాశాలు అందుకోవచ్చు.
వైవిధ్య కెరీర్‌కు ఆహ్వానం రూరల్ మేనేజ్‌మెంట్ సంప్రదాయ మేనేజ్‌మెంట్ కోర్సులకు భిన్నమైనది. డెవలప్‌మెంట్ స్టడీస్పై ఆసక్తితో ఈ కోర్సుల్లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది. రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సుల అభ్యర్థులకు కెరీర్ అవకాశాలను పరిశీలిస్తే రిలయన్స్ ఫౌండేషన్, సేవ్ చిల్డ్రన్, అగాఖాన్ ఫౌండేషన్ తదితర ఎన్‌జీవోలు; మైక్రోఫైనాన్స్ సంబంధించిన బ్యాంక్ ఏజెన్సీల్లో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవచ్చు. అలాగే ఐసీటీ, టెక్నాలజీ అండ్ కన్సల్టెన్సీస్‌లోనూ అవకాశాలు అందుకోవచ్చు. ముఖ్యంగా ఆగ్రో బిజినెస్, లైవ్లీహుడ్ యాక్టివిటీస్, డైరీ మార్కెటింగ్‌లో కొలువులను దక్కించుకువోచ్చు. ఓఎన్‌జీసీ, గెయిల్, అజీమ్ ప్రేమ్‌జీ, టాటా వంటి కార్పొరేట్ కంపెనీలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల సోషల్ రెస్పాన్సిబిలిటీ సేవల్లో మేనేజర్లుగా స్థిరపడొచ్చు. - హేమంత్ కుమార్ మిశ్రా, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐహెచ్‌ఎంఆర్. |
Published date : 28 Nov 2018 04:44PM