రెజ్యూమె ప్రిపరేషన్ లో ప్రతిభ తెలిసేలా.. ఇలా ఉండాలి..
Sakshi Education
రెజ్యూమెలో గత ఉద్యోగంలో సాధించిన ఘనతలను ప్రస్తుతం దరఖాస్తు చేసుకుంటున్న కొలువుకు మధ్య సంబంధాన్ని ఏర్పరచడం కొంత కష్టతరమైనదే! అలాంటప్పుడు అభ్యర్థి గత కొలువులో చూపించిన ప్రతిభను రిక్రూటర్‌కు అర్థమయ్యేలా సులభంగా చెప్పాలి. తద్వారా సదరు కొలువుకు పోటీ పడుతున్న అభ్యర్థుల్లో మేటిగా నిలిచే అవకాశం ఉంటుంది. ఒక వేళ ప్రస్తుతం కరోనా ప్రభావిత రంగంలో పనిచేస్తూ.. మరో రంగంలో కొలువుకు ప్రయత్నిస్తున్నట్లయితే.. ఏయే నైపుణ్యాలు, అనుభవం ద్వారా కొత్త కొలువును సమర్థంగా నిర్వహించగలరో పేర్కొనాలి. ఉదాహరణకు అభ్యర్థి టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌లో బలంగా ఉన్నట్లయితే.. దాని ద్వారా కంపెనీకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్పగలగాలి.
సులభంగా..
- రిక్రూటర్లకు సాధారణంగా ఒక్కో రెజ్యూమెను పరిశీలించేందుకు ఆరు నుంచి ఎనిమిది సెకన్లు మాత్రమే కేటాయిస్తారని అంచనా. కాబట్టి అభ్యర్థులు ఆ సమయంలో రిక్రూటర్ ముఖ్య సమాచారాన్ని గుర్తించేలా రెజ్యూమెను రూపొందించుకోవాలి. దీని కోసం కింది పద్ధతిని అనుసరించడం లాభిస్తుంది.
- రెజ్యూమెను ఒకే పేజీకి పరిమితం అయ్యేలా చూసుకోవాలి. దీనికోసం 10 ఏళ్ల కిందట నిర్వహించిన కొలువులతోపాటు ఇతరత్రా ప్రాధాన్యత లేని సమాచారాన్ని తొలగించాలి.
- డాక్యుమెంట్ మార్జిన్ 1/2 నుంచి 1 మధ్య ఉండేలా చూసుకోవాలి.
- రెజ్యూమె రైటింగ్‌కు ఏరియల్, హాల్వెటిక వంటి ప్లెయిన్ అండ్ ప్రొఫెషనల్ ఫాంట్స్‌ను వినియోగించాలి.
- ఫాంట్ సైజును 10 నుంచి 12 మధ్య ఉండేలా చూసుకోవాలి. ఇంతకంటే చిన్నవయితే చదివేందుకు ఇబ్బందిగా, పెద్దవైతే అన్‌ప్రొఫెషనల్‌గా అనిపించేందుకు ఆస్కారం ఉంది.
కీలక సూచనలు..
- ఎంప్లాయర్ రిక్వైర్‌మెంట్స్‌లో సంబంధిత రంగం లేదా కొలువులో అనుభవం (సంవత్సరాల్లో)తోపాటు నిర్దిష్ట స్కిల్స్‌ను పేర్కొన్నట్లయితే.. రెజ్యూమె సమ్మరీలో ఎక్స్‌పీరియెన్స్‌ను పేర్కొనాలి.
- ఎంప్లాయర్ జాబ్ డిస్క్రిప్షన్‌లో హార్డ్/సాఫ్ట్ స్కిల్స్‌తోపాటు నిర్దిష్ట సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్/కస్టమర్ సర్వీస్ స్కిల్స్‌ను పేర్కొన్నట్లయితే.. రెజ్యూమె టాప్‌లో స్కిల్స్ విభాగం ఇవి ఉండేలా చూసుకోవాలి.
- కొలువులు, రంగాలు/విభాగాలు మారుతున్నట్లయితే.. రెజ్యూమెలో స్కిల్స్ విభాగాన్ని ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియెన్స్ విభాగంపైన ఉంచాలి.
- స్వల్ప పని అనుభవం కలిగిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు..ఎడ్యుకేషన్ విభాగం రెజ్యూమెలో పైభాగంలో వచ్చేలా రూపొందించుకోవాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగినట్లయితే..ఎడ్యుకేషన్ వివరాలను రెజ్యూమె కింది భాగంలో పేర్కొనాలి. అలాగే ఐదేళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులు.. ఆయా కోర్సులు చదివిన సంవత్సరాలు, జీపీఏ ఇతరత్రా వివరాలను తొలగించాలి.
- రెజ్యూమె రూపకల్పనలో బుల్లెట్ పాయింట్స్‌ను వినియోగించాలి. అలాగే రూపొందించుకున్న రెజ్యూమెపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి.
ఇంకా చదవండి: part 1: కొలువు కొట్టాలంటే ఆకట్టుకునే రెజ్యూమె ఎంతో ముఖ్యం.. రెజ్యూమెలో రకాలు ఇలా..
Published date : 25 Dec 2020 02:39PM