ఫోరెన్సిక్ ఆడిటింగ్... అప్ కమింగ్ కెరీర్
Sakshi Education
ఫోరెన్సిక్ ఆడిటింగ్ అంటే ఏమిటి.. ఇటీవల కాలంలో ఫోరెన్సిక్ ఆడిటింగ్ ప్రాధాన్యత పెరగడానికి కారణమేంటి.. అసలు ఫోరెన్సిక్ ఆడిటర్లు ఏం చేస్తారు..
ఫోరెన్సిక్ ఆడిటర్‌గా మారడానికి బీకామ్ సరిపోతుందా.. ఎలాంటి సర్టిఫికేషన్స్ పూర్తిచేయాలి.. సీఏలకు ఈ రంగంలో ఎలాంటి అవకాశాలు లభిస్తున్నాయి.. అధీకృత ఫోరెన్సిక్ ఆడిటర్స్‌గా మారేందుకు మార్గాలేంటి.. కార్పొరేట్ సంస్థల్లో కొలువులు అందుకునే మార్గాలేంటి..? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానమే.. ఈ కథనం...
ఫోరెన్సిక్ ఆడిటింగ్ అంటే?
ఫోరెన్సిక్ అంటే... నేర పరిశోధనలో సైంటిఫిక్ టెక్నిక్స్ ఉపయోగించడం! ఓ కంపెనీ ఖాతాలను, కార్యకలాపాలను నిష్పాక్షికంగా, స్వతంత్రంగా పరిశీలించడమే... ఆడిటింగ్!! దీన్నిబట్టి ఆయా సంస్థలు లేదా వ్యక్తుల ఆర్థిక లావాదేవీలను సునిశితంగా, శాస్త్రీయంగా పరిశీలించే ప్రక్రియను ఫోరెన్సిక్ ఆడిటింగ్ అని చెప్పొచ్చు. ఈ ప్రక్రియ నిధుల మళ్లింపు, ఎగవేతలు, ఇతర ఆర్థిక అవకతవలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యంగా కూడా ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో కార్పొరేట్ రంగంలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు.. బ్యాంకుల్లో ఎన్‌పీఏలు (నిరర్థక ఆస్తులు) పెరిగిపోవడం.. భారీగా రుణాల ఎగవేతలు.. మనీ లాండరింగ్ వంటివి సర్వసాధారణమయ్యాయి. అందుకే భారీ లావాదేవీలను ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయడాన్ని ఆర్‌బీఐ కూడా తప్పనిసరి చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని టాప్ కంపెనీల్లో ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ఉంది. మన దేశంలోనూ బ్యాంకింగ్ రంగంలో ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిటింగ్ ప్రాధాన్యం మరింతగా పెరిగింది. దాంతో ఈ విభాగంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.
ఫోరెన్సిక్ ఆడిటర్ విధులు..
ఫోరెన్సిక్ ఆడిటర్స్...సంస్థల్లో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకల నివారణకు, నిర్థారణకు కీలకంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఫార్చూన్-500 కంపెనీల్లో 80 శాతం సంస్థలు ఫోరెన్సిక్ ఆడిటర్లను నియమించుకున్నాయంటేనే ఫోరెన్సిక్ ఆడిటర్ల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫోరెన్సిక్ ఆడిటర్ల విధులు చాలా కీలకంగా మారుతున్నాయి. ఆర్థిక లోపాలు జరిగిన సంస్థల్లో వీరు అన్ని అకౌంట్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తారు. అకౌంటింగ్, ఆడిటింగ్ విభాగాల్లోని రికార్డులను క్షుణ్నంగా, సునిశితంగా పరిశీలించి లోపం ఎక్కడ జరిగిందో ఇట్టే పసిగడతారు. ఈ ప్రక్రియలో భాగంగా సైబర్ ‘లా’స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాలతో కలిసి పనిచేస్తారు. ఫలితంగా మోసాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలకు అవసరమైన ఆధారాలను వీరు సిద్ధం చేస్తారని చెప్పొచ్చు. ఫోరెన్సిక్ ఆడిటింగ్ వల్ల భవిష్యత్‌లో లోపాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా అవకాశం లభిస్తుంది.
కెరీర్ అడుగులు..
ఫోరెన్సిక్ ఆడిటింగ్ విభాగంలో బీకాంతోనే కెరీర్ ప్రారంభించే అవకాశముంది. బీకామ్‌తోపాటు ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు సంబంధించిన సర్టిఫికేషన్స్ ఉంటే ఉద్యోగావకాశాలు రెట్టింపవడం ఖాయం. ప్రస్తుతం ఈ సర్టిఫికేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన అమెరికాకు చెందిన అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్ (ఏసీఎఫ్‌ఈ) సంస్థ అందిస్తోంది. దీన్ని ఆన్‌లైన్‌లోనే అభ్యసించి నిర్ణీత వ్యవధిలోని కోర్సు పూర్తి అయ్యాక నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ హోదా లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా ఫోరెన్సిక్ ఆడిటర్, ఫోరెన్సిక్ అకౌంటెంట్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
ఏసీఎఫ్‌ఈ మెంబర్‌షిప్‌కు మార్గం :
అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్(ఏసీఎఫ్‌ఈ)లో మెంబర్‌షిప్ పొందాలంటే.. ముందుగా ఔత్సాహికులు సదరు వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో, వెబినార్స్, లింక్డ్‌ఇన్ తదితర మార్గాల ద్వారా కోర్సుకు సంబంధించిన సబ్జెక్ట్‌లలో అభ్యసనం పూర్తిచేయాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకుంటే.. అనుమతి లభిస్తుంది. ఈ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో ఉంటుంది. అవి..
ఇండియా ఫోరెన్సిక్.. సీఎఫ్‌ఏపీ
తాజా బీకాం గ్రాడ్యుయేట్ల కోసం ఇండియా ఫోరెన్సిక్ సంస్థ సర్టిఫైడ్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రొఫెషనల్ (సీఎఫ్‌ఏపీ) కోర్సును అందిస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతోపాటు, మూడేళ్ల పని అనుభవం ఉంటే ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవచ్చు. పని అనుభవం లేని తాజా గ్రాడ్యుయేట్లు కూడా రిజిస్టర్ చేసుకునే వీలుంది. ఇందుకోసం ఇండియా ఫోరెన్సిక్ సెంటర్ ఆఫ్ స్టడీస్ నిర్వహించే ఫోరెన్సిక్ అకౌంటింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత వీరికి కూడా సీఎఫ్‌ఏపీ మెంబర్‌షిప్‌నకు అర్హత లభిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసుకున్నాక.. నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఫోరెన్సిక్ అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ అందించే సర్టిఫికెట్ లభిస్తుంది. దీంతో అంతర్జాతీయంగా అవకాశాలు అందు కోవచ్చు.
ఐసీఏఐ ఆధ్వర్యంలో.. సీఏలకు
ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ).. ప్రాక్టీసింగ్ సీఏలకు ఏడు రోజుల వ్యవధిలో సర్టిఫికెట్ కోర్స్ ఆన్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్ పేరుతో ప్రత్యేక కోర్సును నిర్వహిస్తోంది.
ఉత్సుకత, సునిశిత పరిశీలన ప్రధానం..
ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో బీకాంతోనే కెరీర్ ప్రారంభించే అవకాశముంది. ఈ విభాగంలో అడుగుపెట్టాలనుకునే వారికి ఉత్సుకత, సునిశిత పరిశీలన వంటి లక్షణాలు తప్పనిసరి. ఈ కెరీర్‌లో ఇష్టంగా పనిచేస్తే ఆకాశమే హద్దుగా ఎదగొచ్చు. ప్రతి కేస్‌లో ఒక కొత్త విషయం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఫోరెన్సిక్ ఆడిటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇది అప్ కమింగ్ కెరీర్‌గా మారుతోంది. కాబట్టి ఇప్పుడే దీనివైపు దృష్టి సారిస్తే.. రానున్న రోజుల్లో అవకాశాలు సొంతం చేసుకోవడంలో ముందంజలో నిలవొచ్చు.
- పి.శరత్ కుమార్, సీఏ, ఏసీఎఫ్‌ఈ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్.

- ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫ్రాడ్ స్కీమ్స్
- ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ డిటెరెన్స్
- ఇన్వెస్టిగేషన్
- లా. ఏసీఎఫ్‌ఈ నిర్వహించే సర్టిఫికేషన్ కోర్సును మన దేశంలోనూ అభ్యసించే వీలుంది. ఏసీఎఫ్‌ఈకి అంతర్జాతీయంగా చాప్టర్లుగా పిలిచే ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. మన దేశంలో హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రముఖ నగరాల్లో వీటిని ఏర్పాటు చేశారు
ఇండియా ఫోరెన్సిక్.. సీఎఫ్‌ఏపీ
తాజా బీకాం గ్రాడ్యుయేట్ల కోసం ఇండియా ఫోరెన్సిక్ సంస్థ సర్టిఫైడ్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రొఫెషనల్ (సీఎఫ్‌ఏపీ) కోర్సును అందిస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతోపాటు, మూడేళ్ల పని అనుభవం ఉంటే ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవచ్చు. పని అనుభవం లేని తాజా గ్రాడ్యుయేట్లు కూడా రిజిస్టర్ చేసుకునే వీలుంది. ఇందుకోసం ఇండియా ఫోరెన్సిక్ సెంటర్ ఆఫ్ స్టడీస్ నిర్వహించే ఫోరెన్సిక్ అకౌంటింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత వీరికి కూడా సీఎఫ్‌ఏపీ మెంబర్‌షిప్‌నకు అర్హత లభిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసుకున్నాక.. నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఫోరెన్సిక్ అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ అందించే సర్టిఫికెట్ లభిస్తుంది. దీంతో అంతర్జాతీయంగా అవకాశాలు అందు కోవచ్చు.
ఐసీఏఐ ఆధ్వర్యంలో.. సీఏలకు
ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ).. ప్రాక్టీసింగ్ సీఏలకు ఏడు రోజుల వ్యవధిలో సర్టిఫికెట్ కోర్స్ ఆన్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్ పేరుతో ప్రత్యేక కోర్సును నిర్వహిస్తోంది.
అకడమిక్‌గా అడుగులు..
ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఇప్పుడిప్పుడే కొన్ని అకడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును అందించే ప్రయత్నాలు ప్రారంభించాయి. గుజరాత్ ఫోరెన్సిక్ సెన్సైస్ యూనివర్సిటీ సంవత్సరం వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ కోర్సును అందిస్తోంది. అదే విధంగా గుజరాత్ యూనివర్సిటీ గతేడాది పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కోర్సును ప్రారంభించింది.
మెరిసే కెరీర్ ఖాయం :
ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో సర్టిఫికేషన్ సొంతం చేసుకున్న వారికి మెరిసే కెరీర్ లభించడం ఖాయం. ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకుల్లో రూ.50కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తంలో నమోదైన ఎన్‌పీఏల విషయంలో తప్పనిసరిగా ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేపట్టాలనే నిబంధన విధించింది. ఇందుకోసం బ్యాంకులు ప్రస్తుతం ఈ రంగంలో నిపుణులైన చార్టర్డ్ అకౌంటెంట్లను, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థలను సంప్రదిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌లో శాశ్వత ప్రాతిపదికన ఫోరెన్సిక్ ఆడిటర్స్ ఉద్యోగాలు లభించే అవకాశముందని నిపుణుల అంచనా.
‘టెకీ’లకు మార్గమే :
ఫోరెన్సిక్ ఆడిటింగ్ విభాగం.. కామర్స్ గ్రాడ్యుయేట్లు, సీఏలకే కాకుండా.. టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు సైతం కెరీర్ మార్గంగా మారుతోంది. ఎందుకంటే... ఓ సంస్థలో ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేసే క్రమంలో..పలు పద్దుల కింద జరిగిన లావాదేవీలను ఫోరెన్సిక్ ఆడిటర్లు పరిశీలించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో నిర్దిష్టంగా ఒక్కో పద్దు కింద జరిగిన లావాదేవీలను అన్నింటినీ పరిశీలించాలంటే.. చాలా ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఆడిటర్ల అవసరాలకు అనుగుణంగా వారికి అవసరమైన పద్దులను క్రోడీకరించి ఇచ్చే విధంగా డేటా మైనింగ్, డేటా డిస్ట్రిబ్యూషన్ వంటి విభాగాల్లో టెక్నికల్ గ్రాడ్యుయేట్ల అవసరం ఏర్పడుతోంది.
ఆ నాలుగు ప్రధాన ఉపాధి వేదికలు :
సంస్థలు ఏసీఎఫ్‌ఈ, ఇండియా ఫోరెన్సిక్ వంటి సంస్థలను సంప్రదించి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ వివరాలు తెలుసుకుని వారిద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఆడిటర్లకు నాలుగు కన్సల్టింగ్ సంస్థలు.. కేపీఎంజీ, డెలాయిట్, ఇ అండ్ వై, పీడబ్ల్యూసీ.. ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అవి.. కార్పొరేట్ రంగంలోని పలు సంస్థలకు సేవలు అందిస్తూ.. అందుకోసం సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఆడిటర్లను నియమించుకుంటున్నాయి. ప్రస్తుతం అంచనాల ప్రకారం ఈ నాలుగు సంస్థల్లో దాదాపు అయిదు వేల మంది వరకు ఫోరెన్సిక్ ఆడిటర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలు ముందుగా సీఏలను నియమించుకుని.. వారిని ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో శిక్షణనిస్తున్నాయి. అదేవిధంగా ఐఐఎంలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లో ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో పట్టా అందుకున్న అభ్యర్థులను నియమించుకుని కూడా శిక్షణ నివ్వడం ద్వారా ఈ రంగంలో సేవలు అందిస్తున్నాయి.
వేతనాలు ఆకర్షణీయం..
ఫోరెన్సిక్ ఆడిటర్లకు లభించే వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బీకాం అర్హతతో ఏసీఎఫ్‌ఈ సర్టిఫికేషన్ పొందిన వారికి నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం లభిస్తోంది. పనితీరు ప్రాతిపదికగా రెండు, మూడేళ్ల అనుభవంతోనే రెట్టింపు స్థాయిలో ఈ వేతనాలు పెరిగే అవకాశం ఉంది. సీఏ కోర్సు పూర్తిచేసి ఏసీఎఫ్‌ఈ సర్టిఫికెట్ చేతిలో ఉంటే ప్రారంభంలోనే దాదాపు రూ. లక్ష వరకు వేతనం సొంతం చేసుకోవచ్చు.
ఉపయోగపడే వెబ్‌సైట్లు
ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఇప్పుడిప్పుడే కొన్ని అకడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును అందించే ప్రయత్నాలు ప్రారంభించాయి. గుజరాత్ ఫోరెన్సిక్ సెన్సైస్ యూనివర్సిటీ సంవత్సరం వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ కోర్సును అందిస్తోంది. అదే విధంగా గుజరాత్ యూనివర్సిటీ గతేడాది పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కోర్సును ప్రారంభించింది.
మెరిసే కెరీర్ ఖాయం :
ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో సర్టిఫికేషన్ సొంతం చేసుకున్న వారికి మెరిసే కెరీర్ లభించడం ఖాయం. ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకుల్లో రూ.50కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తంలో నమోదైన ఎన్‌పీఏల విషయంలో తప్పనిసరిగా ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేపట్టాలనే నిబంధన విధించింది. ఇందుకోసం బ్యాంకులు ప్రస్తుతం ఈ రంగంలో నిపుణులైన చార్టర్డ్ అకౌంటెంట్లను, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థలను సంప్రదిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌లో శాశ్వత ప్రాతిపదికన ఫోరెన్సిక్ ఆడిటర్స్ ఉద్యోగాలు లభించే అవకాశముందని నిపుణుల అంచనా.
‘టెకీ’లకు మార్గమే :
ఫోరెన్సిక్ ఆడిటింగ్ విభాగం.. కామర్స్ గ్రాడ్యుయేట్లు, సీఏలకే కాకుండా.. టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు సైతం కెరీర్ మార్గంగా మారుతోంది. ఎందుకంటే... ఓ సంస్థలో ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేసే క్రమంలో..పలు పద్దుల కింద జరిగిన లావాదేవీలను ఫోరెన్సిక్ ఆడిటర్లు పరిశీలించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో నిర్దిష్టంగా ఒక్కో పద్దు కింద జరిగిన లావాదేవీలను అన్నింటినీ పరిశీలించాలంటే.. చాలా ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఆడిటర్ల అవసరాలకు అనుగుణంగా వారికి అవసరమైన పద్దులను క్రోడీకరించి ఇచ్చే విధంగా డేటా మైనింగ్, డేటా డిస్ట్రిబ్యూషన్ వంటి విభాగాల్లో టెక్నికల్ గ్రాడ్యుయేట్ల అవసరం ఏర్పడుతోంది.
ఆ నాలుగు ప్రధాన ఉపాధి వేదికలు :
సంస్థలు ఏసీఎఫ్‌ఈ, ఇండియా ఫోరెన్సిక్ వంటి సంస్థలను సంప్రదించి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ వివరాలు తెలుసుకుని వారిద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఆడిటర్లకు నాలుగు కన్సల్టింగ్ సంస్థలు.. కేపీఎంజీ, డెలాయిట్, ఇ అండ్ వై, పీడబ్ల్యూసీ.. ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అవి.. కార్పొరేట్ రంగంలోని పలు సంస్థలకు సేవలు అందిస్తూ.. అందుకోసం సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఆడిటర్లను నియమించుకుంటున్నాయి. ప్రస్తుతం అంచనాల ప్రకారం ఈ నాలుగు సంస్థల్లో దాదాపు అయిదు వేల మంది వరకు ఫోరెన్సిక్ ఆడిటర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలు ముందుగా సీఏలను నియమించుకుని.. వారిని ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో శిక్షణనిస్తున్నాయి. అదేవిధంగా ఐఐఎంలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లో ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో పట్టా అందుకున్న అభ్యర్థులను నియమించుకుని కూడా శిక్షణ నివ్వడం ద్వారా ఈ రంగంలో సేవలు అందిస్తున్నాయి.
వేతనాలు ఆకర్షణీయం..
ఫోరెన్సిక్ ఆడిటర్లకు లభించే వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బీకాం అర్హతతో ఏసీఎఫ్‌ఈ సర్టిఫికేషన్ పొందిన వారికి నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం లభిస్తోంది. పనితీరు ప్రాతిపదికగా రెండు, మూడేళ్ల అనుభవంతోనే రెట్టింపు స్థాయిలో ఈ వేతనాలు పెరిగే అవకాశం ఉంది. సీఏ కోర్సు పూర్తిచేసి ఏసీఎఫ్‌ఈ సర్టిఫికెట్ చేతిలో ఉంటే ప్రారంభంలోనే దాదాపు రూ. లక్ష వరకు వేతనం సొంతం చేసుకోవచ్చు.
ఉపయోగపడే వెబ్‌సైట్లు
ఉత్సుకత, సునిశిత పరిశీలన ప్రధానం..
ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో బీకాంతోనే కెరీర్ ప్రారంభించే అవకాశముంది. ఈ విభాగంలో అడుగుపెట్టాలనుకునే వారికి ఉత్సుకత, సునిశిత పరిశీలన వంటి లక్షణాలు తప్పనిసరి. ఈ కెరీర్‌లో ఇష్టంగా పనిచేస్తే ఆకాశమే హద్దుగా ఎదగొచ్చు. ప్రతి కేస్‌లో ఒక కొత్త విషయం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఫోరెన్సిక్ ఆడిటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇది అప్ కమింగ్ కెరీర్‌గా మారుతోంది. కాబట్టి ఇప్పుడే దీనివైపు దృష్టి సారిస్తే.. రానున్న రోజుల్లో అవకాశాలు సొంతం చేసుకోవడంలో ముందంజలో నిలవొచ్చు.
- పి.శరత్ కుమార్, సీఏ, ఏసీఎఫ్‌ఈ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్.
Published date : 26 Oct 2018 05:24PM