ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో మంచి భవిష్యత్తు.. చేయాల్సిన కోర్సులు ఇవే!!
బీకాం ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, బీకాం ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ ఫైనాన్స్ విద్యార్థులకు కెరీర్ పరంగా అదననపు ప్రయోజనం ఉంటుంది. కెరీర్ పరంగా ఉన్నత స్థాయిని అందుకోవాలంటే మాత్రం ఆయా సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ను పూర్తి చేయడం తప్పనిసరి. డిగ్రీతో కెరీర్ ప్రారంభించాలనుకొనే అభ్యర్థులు స్టాక్ ఎక్ఛేంజ్, స్టాక్ మార్కెట్‌లకు సంబంధించి స్వల్పకాలిక కోర్సులు పూర్తిచేయడం లాభిస్తుంది.
విధులు..
- ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజర్: క్లయింట్లకు రిటర్న్స్(ఆదాయాలు) తెచ్చేలా నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ అనలిస్టులకు అవసరమైన డేటాను అందించి.. లాభదాయక నిర్ణయం తీసుకొనేలా వ్యవహరిస్తారు.
- మ్యూచువల్ ఫండ్ మేనేజర్: ధర-ఆదాయాల శాతం, డివిడెండ్స్, బాండ్లు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ధరలను పరిశీలించి.. క్లయింట్లకు మంచి బాండ్లు, స్టాక్స్‌ను సూచిస్తారు.
- పోర్ట్ ఫోలియో మేనేజర్: వయసు, ప్రస్తుత ఆదాయాలు, భవిష్యత్ ఆదాయ సామర్థ్యాలు, రిస్కు తీసుకోగలిగే సామర్థ్యం తదితరాలను పరిశీలించి.. వ్యక్తులకు ఇన్వెస్ట్‌మెంట్‌పై సలహాలు, సూచనలు చేస్తారు. అదేవిధంగా క్లయింట్లకు వేర్వేరు ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలపై అవగాహన కల్పిస్తారు.
ఇతర జాబ్ ప్రొఫైల్స్..
- ఫైనాన్షియల్ అనలిస్ట్
- స్టాక్ బ్రోకర్
- రిస్క్ మేనేజర్
- ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్
- రిస్క్ అనలిస్ట్
- రేటింగ్స్ అనలిస్ట్
- పైవేట్ ఈక్విటీ అసోసియేట్
కొలువులు..
- ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్, మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెన్సీస్‌లో ఫ్రెషర్స్‌తోపాటు అనుభవం ఉన్న వారు ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
- హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్; జ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ లిమిటెడ్; జ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్; జ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్; జ కొటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్; జ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్; జ ఫ్రాంక్లిన్ టెంప్లీటన్ మ్యూచువల్ ఫండ్; జ ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్; జ డీఎస్‌పీ బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ తదితర సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించొచ్చు.
నైపుణ్యాలు..
- న్యూమరసీపై పట్టు
- అన్ని అంశాలను పరిశీలించే, ప్రశ్నించే మనస్తత్వం
- ఆలోచనలను వ్యక్తీకరించే నైపుణ్యం
- వాణిజ్య అవగాహన
- కమ్యూనికేషన్ స్కిల్స్
- మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు
- ఆత్మవిశ్వాసం
- అనలిటికల్ స్కిల్స్
- ఐటీ నైపుణ్యాలు
- పాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తదితరాలు సొంతం చేసుకుంటే... ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో రాణించొచ్చు.
వేతనాలు..
ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ల వేతనాలు పలు ప్రామాణికాల ఆధారంగా ఉంటాయి. అకడెమిక్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్,ట్రాక్ రికార్డు, పనిచేసిన, పని చేయాలనుకుంటున్న విభాగం, నైపుణ్యాలు, కంపెనీ తదితరాల ఆధారంగా వేతనాలు లభిస్తాయి. ఎంట్రీ లెవల్‌లో రూ.3.5లక్షల నుంచి రూ.5.5 లక్షలు; మధ్యస్థాయిలో రూ.6లక్షల నుంచి రూ.10 లక్షలు; సీనియర్ లెవల్‌లో రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ వార్షిక వేతనాలు లభిస్తున్నాయి.
అనుకూలతలు..
డైనమిక్ వర్క్ కల్చర్ జ నిత్యం వినూత్న ఆలోచనలు, పరిష్కారాలతో సిద్ధం కావాల్సి ఉండటం జ మంచి గుర్తింపు, ఆకర్షణీయ వేతనాలు జ మెరుగైన ఉద్యోగ భద్రత వంటివి ఇన్వెస్‌మెంట్ మేనేజ్‌మెంట్ కెరీర్ పరంగా సానుకూల అంశాలుగా చెప్పొచ్చు.
ప్రతికూలతలు..
క్లైంట్‌ల అంచనాలకు తగ్గట్టు రిటర్న్స్ కోసం పనిచేయడంలో ఒత్తిడి అధికంగా ఉండటం జ తక్కువ సమయంలో ఎక్కువ రీసెర్చ్ చేయాల్సి రావడం జ నిర్దిష్ట పనివేళలు ఉన్నప్పటికీ కొత్త ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీల కోసం అదనపు సమయం వెచ్చించాల్సి రావడం జ పోటీ ఎక్కువ ఉండటం వంటివి ప్రతికూల అంశాలుగా భావించొచ్చు.
ఇంకా తెలుసుకోండి: part 1: కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులు.. ఉద్యోగ అవకాశాలు ఇవిగో!!