కెరీర్ గైడెన్స్.. డైటీషియన్
Sakshi Education
ప్రజల జీవన శైలి మారింది. ప్రతి పనిలో వేగం, సమయాభావం కీలకంగా మారుతున్నాయి. దీనికనుగుణంగానే ఆహారపు అలవాట్లు మారాయి. ‘తినడం’ కోసం కూడా ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో తీసుకునే ఆహారం శక్తిని ఇస్తుందా, ఆరోగ్యకరమైందా అనే విషయాలకంటే త్వరగా, తేలిగ్గా తీసుకునే వీలుందా లేదా అనేదే ప్రధానమైంది. పర్యవసానంగా పౌష్టికాహారం లోపించి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దీనికి పరిష్కారం? ఆరోగ్యకరమైన ‘డైట్’. ఎన్ని మందులు వాడినా సరైన డైట్‌తోనే సగం రోగాలు నయమవుతాయి. ఇక్కడే డైటీషియన్ అవసరం ఏర్పడుతోంది.
అధిక శాతం రోగాలకు సమతులాహార లోపమే ప్రధాన కారణంగా తేలింది. తీసుకునే ఆహారాన్ని సరిపడే విధంగా పోషకాహార విలువల్లో తుల్యత పాటిస్తూ డైట్‌ను ప్రిస్క్రెబ్ చేసే వ్యక్తే ‘డైటీషియన్’. పేషెంట్ పూర్తి వివరాలను మెడికల్ రికార్డ్స్ ద్వారా తెలుసుకుని, వారి స్వభావసిద్ధ ఆహార అలవాట్లను గమనించి, శాస్త్రీయ పద్ధతిలో ఎటువంటి ఆహారం,ఎంత మొత్తంలో, ఏయే సమయాల్లో తీసుకోవాలో సూచించడం డైటీషియన్ పని. నేడు చిన్న ఆస్పత్రి నుంచి కార్పొరేట్ ఆస్పత్రుల వరకూ డైటీషియన్‌ను నియమించుకోవ డం తప్పనిసరైంది. కేవలం రోగులకే కాకుండా చిన్న పిల్లల నుంచి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల వరకు, ఆరోగ్యవంతుల నుంచి వయో వద్ధుల వరకు డైటీషియన్ అవసరం ఏర్పడుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడంతో జిమ్స్, హెల్త్ కేర్ సెంటర్లు, స్కూళ్లు, కళాశాలల హాస్టళ్లలో కూడా డైటీషియన్లను నియమించుకుంటున్నారు. దీంతో వీరికి డిమాండ్ పెరిగింది.
ఎవరికి?
డాక్టర్‌లాగే డైటీషియన్ కూడా ఎంతో గౌరవప్రదమైన వృత్తి. మిగతా వృత్తులతో పోలిస్తే ఒత్తిడి తక్కువ. సౌకర్యవంతమైన పనివేళలు, అధిక రాబడి అదనపు ఆకర్షణలు. వత్తిలో రాణించాలంటే సబ్జెక్టులో లోతైన అవగాహన, తన దగ్గరికి వచ్చేవారి పట్ల కరుణ, సమస్యను వారి కోణంలో అర్ధం చేసుకోగల స్వభావం ఉండాలి.
అవకాశాలు:
ప్రజల జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా గత కొంత కాలంగా మన దేశంలో డైటీషియన్లకు డిమాండ్ పెరుగుతోంది. వీరికి కార్పొరేట్ హాస్పిటల్స్, స్టార్ హోటల్స్,
నర్సింగ్ హోమ్స్, ప్రభుత్వ ఆరోగ్య శాఖలో, కార్పొరేట్ స్కూల్స్/ఇన్‌స్టిట్యూట్స్, హెల్త్ క్లబ్స్, స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్, ఆహార సంబంధి పరిశ్రమలు, రీసెర్చ్ ల్యాబ్స్, వివిధ ఎంఎన్‌సీలలో అవకాశాలుంటున్నాయి. సొంతంగా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా స్థిర పడొచ్చు. విదేశాల విషయానికొస్తే.. అమెరికాలో డైటీషియన్స్‌కు మంచి డిమాండ్ ఉంది.
వేతనాలు:
ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కు నెలకు రూ. 10 వేల నుంచి 20 వేల మధ్య వేతనాలు లభిస్తున్నాయి. తర్వాత అనుభవం ఆధారంగా రెట్టింపు ఆదాయాన్ని పొందొచ్చు. అమెరికాలోనైతే మాస్టర్ డిగ్రీ చేసిన వారికి నెలకు 20 వేల నుంచి 40 వేల యూఎస్ డాలర్ల వరకు లభిస్తాయి.
అర్హతలు:
డైటీషియన్ కోర్సులో చేరాలంటే ముందుగా +2 లేదా ఇంటర్మీడియెట్ తర్వాత బీఎస్సీ హోంసైన్స్ లేదా బీఏ హోంసైన్స్ పూర్తి చేయాలి. తర్వాత హోంసైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఫుడ్ సెన్సైస్ అండ్ న్యూట్రిషన్‌ను స్పెషలైజేషన్‌గా తీసుకోవాలి. దేశంలోని కొన్ని అగ్రికల్చరల్ యూనివర్సిటీలు కూడా హోంసైన్స్‌లో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులను ఆందిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు +2 లేదా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. +2 లెవెల్‌లో సైన్స్ బ్యాక్ గ్రౌండ్ కలిగినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్‌లు:
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ.
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ అప్లెడ్ సెన్సైస్ (ఆనర్స్) ఫుడ్ టెక్
వెబ్‌సైట్: www.du.ac.in/
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: www.angrau.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్-హైదరాబాద్
వెబ్‌సైట్: www.ninindia.org
పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ-లుధియానా (పంజాబ్)
వెబ్‌సైట్: www.pau.edu
యూనివర్సిటీ ఆఫ్ పుణే
వెబ్‌సైట్: www.unipune.ac.in
యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్
వెబ్‌సైట్: www.allduniv.ac.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోం ఎకనమిక్స్.
కోర్సు:బీహెచ్‌ఎస్సీ, డిప్లొమా ఇన్ డైటిటిక్స్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్:
వెబ్‌సైట్: www.du.ac.in/collegedetails
జాదవ్‌పూర్ యూనివర్సిటీ
కోర్సు: బీటెక్/ఎంటెక్ (ఫుడ్ అండ్ బయో కెమికల్ ఇంజనీరింగ్):
వెబ్‌సైట్: www.jadavpur.edu/
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్.
వెబ్‌సైట్: www.unom.ac.in/ice.html
యూనివర్సిటీ ఆఫ్ ముంబై.
వెబ్‌సైట్: www.mu.ac.in/
ఇగ్నోలో కూడా డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ కోర్సు అందుబాటులో ఉంది.
వెబ్‌సైట్: www.ignou.ac.in/

Published date : 15 Jan 2013 08:27PM