హాస్పిటాలిటీ కెరీర్‌కు చక్కటి వేదిక ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈ 2014
Sakshi Education
హాస్పిటాలిటీ రంగం సాధిస్తున్న వృద్ధి.. పెరుగుతున్న అవకాశాల కారణంగా గత కొంత కాలంగా హాస్పిటాలిటీ దాని అనుబంధ రంగం విశ్వసనీయమైన, ఆకర్షణీయమైన కెరీర్‌గా నిలుస్తోంది.. దాంతోపాటు పెరుగుతున్న అవసరాలకనుగుణంగా సరిపడ మానవ వనరులు లేకపోవడం కూడా ఈరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారి పాలిట కల్పతరువుగా మారుతోంది.. ఈ నేపథ్యంలో హాస్పిటాలిటీ రంగంలో ప్రవేశించడానికి చక్కని వేదిక.. ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ).. 2014 సంవతర్సానికి ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ).. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ. బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)తోపాటు ఈ విభాగానికి సంబంధించిన మరో తొమ్మిది కోర్సుల మార్గదర్శకాలను, నాణ్యత ప్రమాణాలను ఎన్‌సీహెచ్‌ఎంసీటీ రూపొందిస్తుంది.
ఆబ్జెక్టివ్‌గా:
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈని ఆబ్జెక్టివ్ విధానంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాలు ఉంటాయి. వివరాలు..
గమనిక: ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ మినహా అన్ని విభాగాల్లో నెగిటివ్ వూర్కింగ్ (0.25) ఉంది.
న్యూమరికల్ ఎబిలిటీ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్:
ఈ విభాగంలో మ్యాథమెటిక్స్, సెన్సైస్‌లోని అంశాలపై విద్యార్థుల ప్రాథమిక అవగాహన స్థాయిని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత హైస్కూల్ స్థాయిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లో రాణించాలంటే పని-కాలం, వడ్డీ, సగటు, దూరం-కాలం, నిష్పత్తి, కసాగు, గసాభా, సూక్ష్మీకరణ వంటి అంశాలపై పట్టు ఉండాలి. సెన్సైస్ విభాగానికి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి దాదాపు 10 వరకు ప్రశ్నలు రావచ్చు. ఇందులో అడిగే ప్రశ్నలు మరీలోతుగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి.
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్:
విద్యార్థుల్లోని విశ్లేషణాత్మక, తార్కిక సావుర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగమిది. ఈ క్రమంలో వెర్బల్, నాన్ వెర్బల్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వెర్బల్ విభాగంలో రీజనింగ్ నుంచి డెరైక్షన్-డిస్టెన్స్, క్లాసిఫికేషన్, కోడింగ్-డీ కోడింగ్, సిరీస్ టెస్ట్, రిలేషన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, కండిషన్స్ అండ్ గ్రూపింగ్, నంబర్-ర్యాంకింగ్- టైమ్-సీక్వెన్సెస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, క్యూబ్స్, డేటా అరేంజ్‌మెంట్, డేటా సఫిషియన్సీ, స్టేట్‌మెంట్స్ వంటి అంశాలపై దృష్టిసారించాలి. నాన్ వెర్బల్ విభాగంలో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, విజువల్ ఎబిలిటీ, అనాలజీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్:
ఈ విభాగంలో ప్రశ్నలు స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా ఉంటాయి. జీకేకి సంబంధించి దేశాలు-రాజధానులు-కరెన్సీ, ప్రముఖ వ్యక్తులు-ప్రదేశాలు, అవార్డులు, జాతీయ చిహ్నాలు, పుస్తకాలు- రచయితలు, కళలు, సాహిత్యం వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఆయా అంశాలను భారతదేశం, ప్రపంచాన్ని నేపథ్యంగా తీసుకుని ప్రిపేర్ కావాలి. కరెంట్ అఫైర్స్ కోసం.. పరీక్ష జరిగే తేదీకి ముందు సంవత్సర కాలంలో జరిగిన ప్రధాన అంశాలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తు లు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి.
ఇంగ్లిష్:
మొత్తం ఐదు విభాగాల్లో ఇంగ్లిష్‌కు అత్యధిక వెయిటేజీ కేటారుుంచారు. ఈ విభాగంలో ఎక్కువ స్కోరు చేసే అభ్యర్థులే మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లిష్ విభాగంపై ఎక్కువ దృష్టి సారించాలి. ఇందుకోసం పదో తరగతి వరకు బేసిక్ గ్రావుర్‌పై పట్టు సాధించాలి. టెన్సెస్, రూల్స్ ఆఫ్ కరె క్ట్ యూసేజ్, రూల్స్ ఆఫ్ కంజెక్షన్, ప్రిపోజిషన్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఇం్రపూవ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూషన్, సెంటెన్స్ కంప్లిషన్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో రాణించాలంటే.. పదాలపై పట్టు సాధించాలి. ప్రతిరోజూ కొన్ని కొత్త పదాలను నేర్చుకోవాలి. కేవలం పదాలను తెలుసుకోవడానికే పరిమితం కాకుండా.. వాటి ఉపయోగంపై కూడా అవగాహన పెంచుకోవాలి. ప్రతిరోజూ ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు, మేగజైన్లను విశ్లేషణాత్మక దృష్టితో చదవాలి. వాటిలో ఉపయోగించిన పదాలు, వాక్యనిర్మాణ క్రవూన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్:
అన్నిటిలోకి కీలకమైన విభాగం ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్. ఈ రంగంలో కీలక పాత్ర పోషించే ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. వివిధ సందర్భాల్లో వ్యవహరించే విధానం? పనిచేసే ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలి? తరహా ప్రశ్నలు అడుగుతారు. వ్యక్తిగత విచ క్షణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఈ విభాగంలో ఇచ్చిన ఆప్షన్లన్నీ సరైనవే అనిపించే రీతిలో ఉంటాయి. అందుకే ఈ విభాగంలోని ప్రశ్నలకు నిర్ణీత మార్కు అని నిర్దేశించలేదు. 0.25. 0.5, 0.75, 1 అని ప్రతి ప్రశ్నకు మార్కులను విభజించారు. అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్, నిర్దేశిత సమాధానం మధ్య సమతుల్యత ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అంటే.. ఎంచుకున్న ఆప్షన్ నిర్ణీత సమాధానానికి సరితూగకపోతే 0.25, పూర్తిస్థాయిలో సరితూగితే ఒకమార్కు కేటాయిస్తారు. వీటికి ఎటువంటి అకడెమిక్ ఓరియెంటేషన్ అవసరం లేదు. మనలోని స్కిల్స్ ఇందులో ఎక్కువ స్కోర్ చేయడానికి దోహదం చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నేరుగా:
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ కేవలం రాతపరీక్ష ద్వారానే కాకుండా ప్రతిభావంతులకు నేరుగా ప్రవేశం కల్పిస్తుంది. ఇంటర్మీడియెట్/తత్సమాన బోర్డు పరీక్షల్లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ గ్రూప్‌ల్లో 1 నుంచి 200 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు.. ఆయా గ్రూప్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఐహెచ్‌ఎంలలో నేరుగా అడ్మిషన్ కల్పిస్తుంది. అంతేకాకుండా కోర్సులో చేరిన తర్వాత మెరిట్ స్టూడెంట్స్‌కు చేయూతనిచ్చే ఉద్దేశంతో స్కాలర్‌షిప్స్‌ను కూడా ప్రదానం చేస్తుంది. వార్షిక పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఎన్‌సీహెచ్‌ఎంసీటీ మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్‌ను కూడా అందజేస్తుంది. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు సంవత్సరానికి రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని కూడా మంజూరు చేస్తుంది.
రిఫరెన్స్ బుక్స్:
హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్‌మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఆన్ బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్‌లో, ఇండియన్ నేవీ హాస్పిటాలిటీ సర్వీస్, క్రూయిజర్లు, మల్టినేషనల్ హాస్పిటాలిటీస్ సర్వీసెస్‌లోను అవకాశాలుంటాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా స్థిర పడొచ్చు. ప్రభుత్వ పరంగా కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లో కూడా అవకాశాలుంటారుు.
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈ 2014 వివరాలు
అర్హత:10+2/తత్సమానం.
వయసు: జూలై 1, 2014 నాటికి 22 ఏళ్లు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధాలుగా.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 7, 2014.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 26, 2014.
వెబ్‌సైట్: applyadmission.net/nchmjee2014
‘‘మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కష్టపడే తత్వం, విశాల దృక్పథంతో వ్యవహరించే గుణం ఉన్న వారు హోటల్ మేనేజ్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను చదవాలంటే ఎన్‌సీహెచ్‌ఎంసీటీజేఈఈ ఒక్కటే మార్గం. ఈ పరీక్ష ద్వారా బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశం పొందొచ్చు. తర్వాత ఆసక్తి ఉంటే సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఎంఎస్సీ, విదేశాల్లో ఎంఎస్ చేయవచ్చు. అవకాశాల పరంగా చూస్తే.. ఎన్‌సీహెచ్‌ఎం అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లలో 100 శాతం ప్లేస్‌మెంట్ లభిస్తుంది. కోర్సు పూర్తికాకముందే ఆఫర్ లెటర్ చేతిలో ఉంటుంది. ఉద్యోగాల విషయంలో ఈ రంగంలో డిమాండ్-సప్లై మధ్య భారీగా వ్యత్యాసం ఉంటోంది. ఆరు లక్షల ఉద్యోగాలు అవసరం ఉంటే.. ఒక శాతం మేర మాత్రమే మానవ వనరులు లభ్యమవుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా హోటల్ మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు చక్కని అవకాశాలు లభిస్తున్నాయి. వేతనాల విషయానికొస్తే.. ఐదంకెల జీతంతో కె రీర్ ప్రారంభించవచ్చు’’
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ).. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ. బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)తోపాటు ఈ విభాగానికి సంబంధించిన మరో తొమ్మిది కోర్సుల మార్గదర్శకాలను, నాణ్యత ప్రమాణాలను ఎన్‌సీహెచ్‌ఎంసీటీ రూపొందిస్తుంది.
ఆబ్జెక్టివ్‌గా:
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈని ఆబ్జెక్టివ్ విధానంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాలు ఉంటాయి. వివరాలు..
విభాగాలు | ప్రశ్నలు | మార్కులు |
న్యూవురికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ | 30 | 30 |
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ | 30 | 30 |
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ | 30 | 30 |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 60 | 60 |
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ | 50 | 50 |
మొత్తం | 200 | 200 |
న్యూమరికల్ ఎబిలిటీ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్:
ఈ విభాగంలో మ్యాథమెటిక్స్, సెన్సైస్‌లోని అంశాలపై విద్యార్థుల ప్రాథమిక అవగాహన స్థాయిని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత హైస్కూల్ స్థాయిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లో రాణించాలంటే పని-కాలం, వడ్డీ, సగటు, దూరం-కాలం, నిష్పత్తి, కసాగు, గసాభా, సూక్ష్మీకరణ వంటి అంశాలపై పట్టు ఉండాలి. సెన్సైస్ విభాగానికి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి దాదాపు 10 వరకు ప్రశ్నలు రావచ్చు. ఇందులో అడిగే ప్రశ్నలు మరీలోతుగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి.
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్:
విద్యార్థుల్లోని విశ్లేషణాత్మక, తార్కిక సావుర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగమిది. ఈ క్రమంలో వెర్బల్, నాన్ వెర్బల్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వెర్బల్ విభాగంలో రీజనింగ్ నుంచి డెరైక్షన్-డిస్టెన్స్, క్లాసిఫికేషన్, కోడింగ్-డీ కోడింగ్, సిరీస్ టెస్ట్, రిలేషన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, కండిషన్స్ అండ్ గ్రూపింగ్, నంబర్-ర్యాంకింగ్- టైమ్-సీక్వెన్సెస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, క్యూబ్స్, డేటా అరేంజ్‌మెంట్, డేటా సఫిషియన్సీ, స్టేట్‌మెంట్స్ వంటి అంశాలపై దృష్టిసారించాలి. నాన్ వెర్బల్ విభాగంలో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, విజువల్ ఎబిలిటీ, అనాలజీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్:
ఈ విభాగంలో ప్రశ్నలు స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా ఉంటాయి. జీకేకి సంబంధించి దేశాలు-రాజధానులు-కరెన్సీ, ప్రముఖ వ్యక్తులు-ప్రదేశాలు, అవార్డులు, జాతీయ చిహ్నాలు, పుస్తకాలు- రచయితలు, కళలు, సాహిత్యం వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఆయా అంశాలను భారతదేశం, ప్రపంచాన్ని నేపథ్యంగా తీసుకుని ప్రిపేర్ కావాలి. కరెంట్ అఫైర్స్ కోసం.. పరీక్ష జరిగే తేదీకి ముందు సంవత్సర కాలంలో జరిగిన ప్రధాన అంశాలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తు లు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి.
ఇంగ్లిష్:
మొత్తం ఐదు విభాగాల్లో ఇంగ్లిష్‌కు అత్యధిక వెయిటేజీ కేటారుుంచారు. ఈ విభాగంలో ఎక్కువ స్కోరు చేసే అభ్యర్థులే మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లిష్ విభాగంపై ఎక్కువ దృష్టి సారించాలి. ఇందుకోసం పదో తరగతి వరకు బేసిక్ గ్రావుర్‌పై పట్టు సాధించాలి. టెన్సెస్, రూల్స్ ఆఫ్ కరె క్ట్ యూసేజ్, రూల్స్ ఆఫ్ కంజెక్షన్, ప్రిపోజిషన్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఇం్రపూవ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూషన్, సెంటెన్స్ కంప్లిషన్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో రాణించాలంటే.. పదాలపై పట్టు సాధించాలి. ప్రతిరోజూ కొన్ని కొత్త పదాలను నేర్చుకోవాలి. కేవలం పదాలను తెలుసుకోవడానికే పరిమితం కాకుండా.. వాటి ఉపయోగంపై కూడా అవగాహన పెంచుకోవాలి. ప్రతిరోజూ ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు, మేగజైన్లను విశ్లేషణాత్మక దృష్టితో చదవాలి. వాటిలో ఉపయోగించిన పదాలు, వాక్యనిర్మాణ క్రవూన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్:
అన్నిటిలోకి కీలకమైన విభాగం ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్. ఈ రంగంలో కీలక పాత్ర పోషించే ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. వివిధ సందర్భాల్లో వ్యవహరించే విధానం? పనిచేసే ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలి? తరహా ప్రశ్నలు అడుగుతారు. వ్యక్తిగత విచ క్షణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఈ విభాగంలో ఇచ్చిన ఆప్షన్లన్నీ సరైనవే అనిపించే రీతిలో ఉంటాయి. అందుకే ఈ విభాగంలోని ప్రశ్నలకు నిర్ణీత మార్కు అని నిర్దేశించలేదు. 0.25. 0.5, 0.75, 1 అని ప్రతి ప్రశ్నకు మార్కులను విభజించారు. అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్, నిర్దేశిత సమాధానం మధ్య సమతుల్యత ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అంటే.. ఎంచుకున్న ఆప్షన్ నిర్ణీత సమాధానానికి సరితూగకపోతే 0.25, పూర్తిస్థాయిలో సరితూగితే ఒకమార్కు కేటాయిస్తారు. వీటికి ఎటువంటి అకడెమిక్ ఓరియెంటేషన్ అవసరం లేదు. మనలోని స్కిల్స్ ఇందులో ఎక్కువ స్కోర్ చేయడానికి దోహదం చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నేరుగా:
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ కేవలం రాతపరీక్ష ద్వారానే కాకుండా ప్రతిభావంతులకు నేరుగా ప్రవేశం కల్పిస్తుంది. ఇంటర్మీడియెట్/తత్సమాన బోర్డు పరీక్షల్లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ గ్రూప్‌ల్లో 1 నుంచి 200 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు.. ఆయా గ్రూప్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఐహెచ్‌ఎంలలో నేరుగా అడ్మిషన్ కల్పిస్తుంది. అంతేకాకుండా కోర్సులో చేరిన తర్వాత మెరిట్ స్టూడెంట్స్‌కు చేయూతనిచ్చే ఉద్దేశంతో స్కాలర్‌షిప్స్‌ను కూడా ప్రదానం చేస్తుంది. వార్షిక పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఎన్‌సీహెచ్‌ఎంసీటీ మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్‌ను కూడా అందజేస్తుంది. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు సంవత్సరానికి రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని కూడా మంజూరు చేస్తుంది.
రిఫరెన్స్ బుక్స్:
- న్యూమరికల్ ఎబిలిటీ కోసం ఎస్‌సీఈఆర్‌టీ 10వ తరగతి మ్యాథ్స్, సైన్స్ పుస్తకాల్లోని ప్రాథమిక అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
- రీజనింగ్‌లో మెరుగైన మార్కులు పజిల్స్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
- సర్వీస్ సెక్టార్ విభాగంలోని అన్ని ప్రశ్నలను ప్రయత్నించాలి.
- ఇంగ్లిష్ కోసం 10, 12వ తరగతుల్లోని గ్రామర్ అంశాలపై దృష్టి సారించాలి.
- ఎన్‌సీఈఆర్‌టీ ఏడు నుంచి పదో తరగతి మ్యాథ్స్, సైన్స్ పుస్తకాలు.
- ఎ గైడ్ టు లాజికల్ రీజనింగ్ - ఆర్.ఎస్. అగర్వాల్
- వునోరవు, ఇండియా ఇయుర్ బుక్స్, ఇంగ్లిష్ దిన పత్రికలు.
- రెన్ అండ్ మార్టిన్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ.
- ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈ ద్వారా ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య -52
- అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య -7,454
- పస్తుత హాస్పిటాలిటీ రంగం విలువ 117.7 యూఎస్ బిలియన్ డాలర్లు. ఇది 2022 నాటికి 418.9 యూఎస్ బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.
హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్‌మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఆన్ బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్‌లో, ఇండియన్ నేవీ హాస్పిటాలిటీ సర్వీస్, క్రూయిజర్లు, మల్టినేషనల్ హాస్పిటాలిటీస్ సర్వీసెస్‌లోను అవకాశాలుంటాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా స్థిర పడొచ్చు. ప్రభుత్వ పరంగా కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లో కూడా అవకాశాలుంటారుు.
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈ 2014 వివరాలు
అర్హత:10+2/తత్సమానం.
వయసు: జూలై 1, 2014 నాటికి 22 ఏళ్లు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధాలుగా.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 7, 2014.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 26, 2014.
వెబ్‌సైట్: applyadmission.net/nchmjee2014
‘‘మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కష్టపడే తత్వం, విశాల దృక్పథంతో వ్యవహరించే గుణం ఉన్న వారు హోటల్ మేనేజ్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను చదవాలంటే ఎన్‌సీహెచ్‌ఎంసీటీజేఈఈ ఒక్కటే మార్గం. ఈ పరీక్ష ద్వారా బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశం పొందొచ్చు. తర్వాత ఆసక్తి ఉంటే సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఎంఎస్సీ, విదేశాల్లో ఎంఎస్ చేయవచ్చు. అవకాశాల పరంగా చూస్తే.. ఎన్‌సీహెచ్‌ఎం అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లలో 100 శాతం ప్లేస్‌మెంట్ లభిస్తుంది. కోర్సు పూర్తికాకముందే ఆఫర్ లెటర్ చేతిలో ఉంటుంది. ఉద్యోగాల విషయంలో ఈ రంగంలో డిమాండ్-సప్లై మధ్య భారీగా వ్యత్యాసం ఉంటోంది. ఆరు లక్షల ఉద్యోగాలు అవసరం ఉంటే.. ఒక శాతం మేర మాత్రమే మానవ వనరులు లభ్యమవుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా హోటల్ మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు చక్కని అవకాశాలు లభిస్తున్నాయి. వేతనాల విషయానికొస్తే.. ఐదంకెల జీతంతో కె రీర్ ప్రారంభించవచ్చు’’
Published date : 23 Jan 2014 12:32PM