విస్తృత అవకాశాలకు కేరాఫ్ అడ్రస్ మెకానికల్ ఇంజనీరింగ్..సమాచారం తెలుసుకోండిలా..
Sakshi Education
ప్రాచీన ఇంజనీరింగ్ విభాగాల్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటి. విస్తృత అవకాశాలకు కేరాఫ్‌గా నిలిచే మరో బ్రాంచ్.. మెకానికల్ ఇంజనీరింగ్. పారిశ్రామికాభివృద్ధికి యంత్రాలే కీలకం. అలాంటి యంత్రాల డిజైన్, తయారీ నుంచి అవి పనిచేసే విధంగా చేయడం వరకూ.. మొత్తం మెకానికల్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం మనం ఉపయోగించే ఆధునిక యంత్రాలు, వాహనాలు, సదుపాయా లకు మూలం.. మెకానికల్ ఇంజనీరింగ్.
నైపుణ్యాలే కీలకం: ఈ బ్రాంచ్ విద్యా ర్థులకు కొత్తగా ఆలోచించడం, సమస్యలను పరిష్కరించే నేర్పు, మ్యాథమెటిక్స్‌పై పట్టు చాలా అవసరం. వీటితోపాటు ఆటోకాడ్, సాలిడ్ వర్క్స్ లాంటి డిజైన్ సాఫ్ట్‌వేర్స్; మ్యాట్ ల్యాబ్, కంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లాంటి విశ్లేషణ సాఫ్ట్‌వేర్‌లు నేర్చుకుంటే.. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలను సొంతం చేసుకోవచ్చు. అలాగే పైథాన్, జావా వంటి కోడింగ్ ప్రావీణ్యం సంపాదిస్తే కోర్ ఉద్యోగాలతోపాటు సాఫ్ట్‌వేర్ కొలువులు సైతం దక్కుతాయి.
పెరిగిన ప్రాధాన్యం: టెక్నాలజీ రంగంలో ఇటీవల కాలంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మానవ వనరుల కొరతను అధిగమించడానికి ప్రతీ రంగంలో ఇప్పుడు ఆటోమేషన్, రోబోటిక్స్, త్రీడి ప్రింటింగ్, డ్రోన్స్ వంటివి ఉపయోగిస్తున్నారు. వీటి నిర్వాహణకు మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణుల అవసరం తప్పనిసరి. దాంతో ఈ బ్రాంచ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.
ఉద్యోగావకాశాలు..
మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పుష్కలం. వీరు నైపుణ్యలను మెరుగుపరచుకుంటే ఉద్యోగాలు సొంతమైనట్లే. మారుతి సుజుకి, టాటా మోటార్స్, రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలే కాకుండా.. ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, ఆర్మీ, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డీఆర్‌డీఓ, హెచ్‌ఎఎల్, ఓఎన్‌జీసీ, సెయిల్, ఎన్‌టీపీసీ వంటి వాటిల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
ఇంకా చదవండి: part 4: బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..

Published date : 22 Oct 2020 06:28PM