Skip to main content

ఎలాంటి కంప్యూటర్ జాబ్ చేయాలనుకుంటున్నారో.. తెలుసుకోండిలా!!

మీరు ఎలాంటి కంప్యూటర్ జాబ్ చేయాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోవాలి.

ఆ తర్వాత అందుకు అనువైన కోడింగ్ లాంగ్వేజ్‌ను ఎంచుకోవాలి. కంప్యూటర్ కొలువుల పరంగా ప్రధానంగా చెప్పుకోదగ్గవి.. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లేదా డిజైనర్ ఎట్ యాన్ ఏజెన్సీ ఈ ఫ్రీలాన్‌‌స వెబ్ డెవలప్‌మెంట్ ఈ బ్యాక్ ఎండ్ లేదా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ ఈ డెవలప్ మొబైల్ యాప్స్ ఈ మేనేజ్ కంటెంట్ ఎట్ యాన్ ఏజెన్సీ, ఫ్రీలాన్సర్ వంటివి.. ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది. చాలావాటికి కొన్ని ఫీచర్స్ కామన్‌గా ఉంటాయి. అంటే.. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే మిగతావి సులువుగానే అందిపుచ్చుకోవచ్చు.

వెబ్‌సైట్స్ రూపొందించేందుకు..

  • వెబ్‌సైట్స్ డిజైనింగ్ అంటే ఇష్టం ఉండి.. ఇందుకోసం ఎక్కువ సమయం వెచ్చించే సహనం ఉంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా పనిచేయవచ్చు. ఇందుకోసం HTML, CSS, JAVA Script/JQuery, Git& GitHub, Sass, JAVA Script Frameworks నేర్చుకోవాలి.
  • ఆసక్తి మేరకు కొన్ని కోర్సులు నేర్చుకుని.. ఫ్రీలాన్‌‌స వెబ్ డిజైనర్‌గా అవసరమైనవారికి అందమైన వెబ్‌సైట్స్ రూపొందించి ఇవ్వవచ్చు. దీని ద్వారా స్వతంత్రంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం HTML, CSS, PHP, JAVA Script / JQuery, Git & GitHub, Sass, JAVA Script Frameworks, WordPress నేర్చుకోవాలి.
  • నంబర్స్, డేటా, పవర్‌ఫుల్ వెబ్‌సైట్స్ రూపకల్పనపై ఆసక్తి ఉండేవారు బ్యాకెండ్ లేదా మొత్తం ప్రాజెక్ట్ రూపకల్పనను చేపట్టవచ్చు. ఇందుకోసం HTML, CSS, PHP, Git & GitHub, Ruby on Rails వంటి కోర్సులపై పట్టు సాధించాలి.
  • పస్తుతం మొబైల్ యాప్ శకం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ దైనందిన పనుల కోసం యాప్స్‌నే వినియోగిస్తున్నారు. మొబైల్ యాప్స్ రూపొందిం చేందుకు అనువైన కోర్సులు HTML, CSS, Git & GitHub, Objectiv-C & Swift.
  • పూర్తి స్థాయి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకునేందుకు చాలాకాలం పడుతుందని భావించే వారు తక్కువ సమయంలో నేర్చుకునే ప్రైమరీ టెక్ కోర్సులు పూర్తిచేసి.. ఆ తర్వాత టెక్నికల్ స్కిల్స్‌తో కంటెంట్ మేనేజర్స్‌గా పనిచేయవచ్చు. ఇందుకోసం HTML, CSS, PHP, WordPress ఉపయోగపడతాయి.

చాలా వరకు ఉచితంగానే శిక్షణ..
ఇప్పుడు చెప్పుకున్న కంప్యూటర్ లాంగ్వేజెస్ ఎప్పటి నుంచో ఉన్నవే. వీటి అవసరాల దృష్ట్యా డిమాండ్ ఎప్పటికీ ఉంటుందని భావించొచ్చు. ఆయా కోర్సులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్స్, ఇతర సంస్థలు ఉచితంగా అందిస్తున్నాయి. పేరొందిన కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్స్‌తోపాటు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్‌‌సబిలిటీ (సీఎస్‌ఆర్)లో భాగంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. అలాగే మూక్స్ వంటి వాటిద్వారా ఆన్‌లైన్ విధానంలో ఆయా కోర్సులపై పట్టు సాధించి.. అవకాశాలు దక్కించుకోవచ్చు.

ఇంకా తెలుసుకోండి: part 2: ఐటీ కోర్సులతో భవిష్యత్తులో ముందుకు ఉరుకుతున్నా యువత.. ఉపాధి మార్గాలు తెలుసుకోండిలా!!
Published date : 15 Oct 2020 04:56PM

Photo Stories