అవకాశాల ‘ఎవరెస్ట్’ టెలి కమ్యూనికేషన్ ఇండస్ట్రీ
Sakshi Education
రూ. 1,09,874 కోట్లు.. 2015, మార్చిలో స్ప్రెక్ట్రమ్ వేలం ద్వారా భారత ప్రభుత్వ ఖజానాకి వచ్చిన ఆదాయం. ఎయిర్‌టెల్, రిలయన్స్, వొడాఫోన్, ఐడియా వంటి దిగ్గజ టెలికం కంపెనీలు పోటీ పడి మరీ ఈ బ్రాడ్ బ్యాండ్ అనుమతులు పొందాయి. గ్లోబల్ మార్కెట్‌లో విస్తరిస్తున్న టెలికం కార్యకలాపాలు, సేవలతో పాటు... టెలి కమ్యూనికేషన్ నిపుణులకు కూడా మంచి డిమాండ్ ఉంది. టెలికాం రంగంలో అవకాశాలు, టెలికం ఇంజనీరింగ్ కెరీర్‌పై ప్రత్యేక ఫోకస్...
టెలికం ఇంజనీరింగ్:
అవకాశాలు:
ప్రధానంగా కింది ఏరియాల్లో టెలి కమ్యూనికేషన్ ఇంజనీర్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయి.
డిప్లొమా నుంచి పీహెచ్‌డీ:
బీటెక్‌లో ఈసీఈ:
టెలికం ఇంజనీరింగ్‌కు సంబంధించి కోర్ ప్రోగ్రామ్స్ అందించే ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య కొంత తక్కువగా ఉంది. అయితే ఈ రంగానికి సంబంధించి బీటెక్ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ బ్రాంచ్‌ల్లో టెలికం రంగంలో కీలకాంశాలైన కమ్యూనికేషన్స్, నెట్‌వర్క్, అనలాగ్ సిస్టమ్స్ వంటి కోర్సులు ఉన్నాయి. వీటి అధ్యయనం ద్వారా ఈ రంగంలో అవకాశాలను అందుకునేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చు.
ప్రత్యేకంగా ఈటీఎం:
టెలికం ఇంజనీరింగ్ నైపుణ్యాలు అందించేందుకు కొన్ని కళాశాలలు బీటెక్ స్థాయిలో ‘ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్- ఈటీఎం’ పేరుతో ప్రత్యేక బ్రాంచ్‌ను అందిస్తున్నాయి. చండీగఢ్ యూనివర్సిటీ; బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దేవీ అహల్య యూనివర్సిటీ; ఎంఎస్ రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి కొన్ని ప్రముఖ యూనివర్సిటీలు / ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ బ్రాంచ్ అందుబాటులో ఉంది.
పీజీ స్థాయిలో.. ఆసక్తికి అనుగుణంగా:
టెలికం రంగంలో ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఎంటెక్ స్థాయిలో విభిన్న స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. నెట్‌వర్క్ కమ్యూనికేషన్స్; ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్; డిజైన్ అండ్ డెవలప్‌మెంట్;టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్; ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం ఇంజనీరింగ్; సిగ్నల్ ప్రాసెసింగ్; వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ స్పెషలైజేషన్లుకు కెరీర్ పరంగా మంచి క్రేజ్ ఉంది.
ప్రభుత్వ ప్రత్యేక శిక్షణ కేంద్రాలు:
టెలికం రంగ విస్తరణ, నిపుణుల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర పభుత్వం ఈ రంగంలో శిక్షణనందించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మేనేజ్‌మెంట్‌లో ‘టెలికం’:
కేవలం ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు / ప్రోగ్రామ్‌లకే పరిమితం కాకుండా పీజీ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో కూడా టెలికం మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీ స్పెషలిస్ట్‌లు ఉత్పత్తులకు సంబంధించిన నైపుణ్యాలు పొందితే.. టెలికం సంస్థల నిర్వహణ, మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ వంటి అంశాల్లో శిక్షణనందించే విధంగా టెలికం మేనేజ్‌మెంట్ కోర్సు ఉంటుంది. టెలికం సర్వీసెస్ టెక్నాలజీస్, వైర్‌లెస్ కమ్యూనికేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, టెలికం సర్వీసెస్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, ఐటీ సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, కన్వర్జెన్స్ ఆఫ్ టెలికం నెట్‌వర్క్, సర్వీసెస్ అండ్ టెక్నాలజీ ట్రెండ్స్ ఇన్ టెలికం, కేస్ స్టడీస్ ఇన్ టెలికం మేనేజ్‌మెంట్ వంటి కోర్ సబ్జెక్ట్‌లలో శిక్షణ ఉంటుంది.
అయిదంకెల జీతం:
టెలికం కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రారంభంలోనే అయిదంకెల జీతం అందుకోవచ్చు. ఎంట్రీ లెవల్‌లో ఫీల్డ్ టెస్ట్ ఇంజనీర్స్; సర్వీస్ ఇంజనీర్స్ హోదాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ. 10 వేలు; బీటెక్ / బీఈ ఉత్తీర్ణులకు నెలకు రూ. 18 వేల నుంచి రూ. 30 వేల వరకు వేతనాలు లభిస్తున్నాయి.
ఉండాల్సిన లక్షణాలు:
టెలికమ్యూనికేషన్స్, అనుబంధ సంస్థల్లో కెరీర్ లక్ష్యంగా ఉన్న వారికి సునిశిత పరిశీలన, నిరంతర అన్వేషణ, మార్కెట్ పరిస్థితులపై నిరంతర అవగాహన, కొత్త ఉత్పత్తుల గురించి అధ్యయనం, రీసెర్చ్‌పై ఆసక్తి వంటివి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు.
టాప్ రిక్రూటర్స్:
ఉద్యోగ సాధనకు మార్గాలు:
బీటెక్ టెలికం/ ఈసీఈ కోర్సు ఉత్తీర్ణతతో బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లలో జేటీఓ, టెక్నికల్ ఇంజనీర్ ట్రైనీగా ప్రవేశించొచ్చు. ప్రభుత్వ కొలువుల కోసం ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ - గేట్’ స్కోరు తప్పనిసరి. ఈ స్కోరు ఆధారంగా ఆయా పీఎస్‌యూలు ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు పూర్తి చేస్తాయి. భారతి ఎయిర్ టెల్, ఐడియా వంటి ప్రైవేటు ఎంఎన్‌సీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఎంపికైన వారికి 4 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వార్షిక వేతనం ఆఫర్ చేస్తున్నాయి.
టెలీ‘భారతం’
సర్టిఫికేట్ కోర్సులు అందిస్తున్న సంస్థలు
టెలికం ఇంజనీరింగ్ ఔత్సాహికులకు నైపుణ్యాలను మరింత పెంపొందించుకునే దిశగా మూడు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలో ఉండే పలు సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ముఖ్యమైన ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు...
- టెలి కమ్యూనికేషన్స్ సేవలు, ఉత్పత్తులకు సంబంధించిన రూపకల్పనలో నైపుణ్యాలు అందించే కోర్సు టెలికం ఇంజనీరింగ్.
- సర్క్యూట్స్ డిజైన్, ట్రాన్స్‌మిషన్ లైన్స్ అండ్ వేవ్ గైడ్స్, ఆడియో/వీడియో ఎలక్ట్రానిక్స్, బ్రాడ్‌క్యాస్టింగ్ వంటి ఎలక్ట్రానిక్ ఆధారిత కమ్యూనికేషన్ అంశాలు ప్రధాన సబ్జెక్ట్‌లు/కోర్సులుగా ఉంటాయి. టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో ప్రధాంనంగా టెలిఫోన్, బ్రాడ్‌క్యాస్టింగ్ అండ్ ఇంటర్‌నెట్ లను ఉపయోగించి చేసే సమాచార మార్పిడి తదితర అంశాల గురించి అధ్యయనం చేస్తారు. టెలికం ఇంజనీర్లు సిస్టమ్ డిజైన్, ఇంప్లిమెంట్, ప్రాసెసింగ్‌తో పాటు సమాచార మార్పిడి వంటి అంశాలను డీల్ చేస్తారు.
అవకాశాలు:
ప్రధానంగా కింది ఏరియాల్లో టెలి కమ్యూనికేషన్ ఇంజనీర్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయి.
- కంప్యూటర్ కమ్యూనికేషన్ అండ్ నెట్ వర్కింగ్.
- మొబైల్ కమ్యూనికేషన్స్.
- వాయిస్ అండ్ డేటా నెట్‌వర్కింగ్.
- టీవీ అండ్ బ్రాడ్ క్యాస్టింగ్.
- ఆప్టికల్ నె ట్‌వర్కింగ్.
- రిమోట్ సెన్సింగ్ అండ్ మెజర్‌మెంట్ అండ్ కంట్రోల్.
- నెక్ట్స్ జనరేషన్ నెట్‌వర్క్.
డిప్లొమా నుంచి పీహెచ్‌డీ:
- ప్రస్తుతం దేశంలో టెలికం ఇంజనీరింగ్‌లో అకడమిక్ అవకాశాలు డిప్లొమా స్థాయి నుంచి పీహెచ్‌డీ వరకు అందుబాటులో ఉన్నాయి.
- డిప్లొమా, ఇంజనీరింగ్ స్థాయిల్లో టెలికం ఇంజనీరింగ్‌తో పాటు ఎంటెక్, పీహెచ్‌డీల్లో పలు స్పెషలైజేషన్స్‌లో (అనలాగ్ సిస్టమ్స్, నెట్ వర్కింగ్ తదితర) అకడమిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
బీటెక్‌లో ఈసీఈ:
టెలికం ఇంజనీరింగ్‌కు సంబంధించి కోర్ ప్రోగ్రామ్స్ అందించే ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య కొంత తక్కువగా ఉంది. అయితే ఈ రంగానికి సంబంధించి బీటెక్ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ బ్రాంచ్‌ల్లో టెలికం రంగంలో కీలకాంశాలైన కమ్యూనికేషన్స్, నెట్‌వర్క్, అనలాగ్ సిస్టమ్స్ వంటి కోర్సులు ఉన్నాయి. వీటి అధ్యయనం ద్వారా ఈ రంగంలో అవకాశాలను అందుకునేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చు.
ప్రత్యేకంగా ఈటీఎం:
టెలికం ఇంజనీరింగ్ నైపుణ్యాలు అందించేందుకు కొన్ని కళాశాలలు బీటెక్ స్థాయిలో ‘ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్- ఈటీఎం’ పేరుతో ప్రత్యేక బ్రాంచ్‌ను అందిస్తున్నాయి. చండీగఢ్ యూనివర్సిటీ; బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దేవీ అహల్య యూనివర్సిటీ; ఎంఎస్ రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి కొన్ని ప్రముఖ యూనివర్సిటీలు / ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ బ్రాంచ్ అందుబాటులో ఉంది.
పీజీ స్థాయిలో.. ఆసక్తికి అనుగుణంగా:
టెలికం రంగంలో ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఎంటెక్ స్థాయిలో విభిన్న స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. నెట్‌వర్క్ కమ్యూనికేషన్స్; ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్; డిజైన్ అండ్ డెవలప్‌మెంట్;టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్; ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం ఇంజనీరింగ్; సిగ్నల్ ప్రాసెసింగ్; వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ స్పెషలైజేషన్లుకు కెరీర్ పరంగా మంచి క్రేజ్ ఉంది.
ప్రభుత్వ ప్రత్యేక శిక్షణ కేంద్రాలు:
టెలికం రంగ విస్తరణ, నిపుణుల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర పభుత్వం ఈ రంగంలో శిక్షణనందించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది.
- టెలికం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీలను ఏర్పాటు చేసింది. అదే విధంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ‘జీఎస్‌ఎం ఆర్‌ఎఫ్ ఇంజనీర్’ పేరుతో షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్సును ప్రారంభించింది.
మేనేజ్‌మెంట్‌లో ‘టెలికం’:
కేవలం ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు / ప్రోగ్రామ్‌లకే పరిమితం కాకుండా పీజీ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో కూడా టెలికం మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీ స్పెషలిస్ట్‌లు ఉత్పత్తులకు సంబంధించిన నైపుణ్యాలు పొందితే.. టెలికం సంస్థల నిర్వహణ, మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ వంటి అంశాల్లో శిక్షణనందించే విధంగా టెలికం మేనేజ్‌మెంట్ కోర్సు ఉంటుంది. టెలికం సర్వీసెస్ టెక్నాలజీస్, వైర్‌లెస్ కమ్యూనికేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, టెలికం సర్వీసెస్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, ఐటీ సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, కన్వర్జెన్స్ ఆఫ్ టెలికం నెట్‌వర్క్, సర్వీసెస్ అండ్ టెక్నాలజీ ట్రెండ్స్ ఇన్ టెలికం, కేస్ స్టడీస్ ఇన్ టెలికం మేనేజ్‌మెంట్ వంటి కోర్ సబ్జెక్ట్‌లలో శిక్షణ ఉంటుంది.
- ఇండియాలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికం మేనేజ్‌మెంట్, వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలు సంయుక్తంగా పీజీ డిప్లొమా ఇన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌ను దూర విద్య విధానంలో అందిస్తున్నాయి.
అయిదంకెల జీతం:
టెలికం కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రారంభంలోనే అయిదంకెల జీతం అందుకోవచ్చు. ఎంట్రీ లెవల్‌లో ఫీల్డ్ టెస్ట్ ఇంజనీర్స్; సర్వీస్ ఇంజనీర్స్ హోదాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ. 10 వేలు; బీటెక్ / బీఈ ఉత్తీర్ణులకు నెలకు రూ. 18 వేల నుంచి రూ. 30 వేల వరకు వేతనాలు లభిస్తున్నాయి.
- ఎంట్రీ లెవల్‌లో ఫీల్డ్ టెస్ట్ ఇంజనీర్‌గా అడుగు పెట్టిన వారు అనుభవం, పనితీరు ఆధారంగా ఆయా విభాగాల్లో సీనియారిటీతో టెక్నికల్ డెరైక్టర్, చీఫ్ ఇంజనీర్, ఇంజనీర్ - ఇన్ - చీఫ్ స్థాయికి చేరుకోవచ్చు.
ఉండాల్సిన లక్షణాలు:
టెలికమ్యూనికేషన్స్, అనుబంధ సంస్థల్లో కెరీర్ లక్ష్యంగా ఉన్న వారికి సునిశిత పరిశీలన, నిరంతర అన్వేషణ, మార్కెట్ పరిస్థితులపై నిరంతర అవగాహన, కొత్త ఉత్పత్తుల గురించి అధ్యయనం, రీసెర్చ్‌పై ఆసక్తి వంటివి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు.
టాప్ రిక్రూటర్స్:
- బీఎస్‌ఎన్‌ఎల్
- ఎంటీఎన్‌ఎల్
- రైల్వేస్
- డీఆర్‌డీఓ
- రక్షణ రంగం
ఉద్యోగ సాధనకు మార్గాలు:
బీటెక్ టెలికం/ ఈసీఈ కోర్సు ఉత్తీర్ణతతో బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లలో జేటీఓ, టెక్నికల్ ఇంజనీర్ ట్రైనీగా ప్రవేశించొచ్చు. ప్రభుత్వ కొలువుల కోసం ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ - గేట్’ స్కోరు తప్పనిసరి. ఈ స్కోరు ఆధారంగా ఆయా పీఎస్‌యూలు ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు పూర్తి చేస్తాయి. భారతి ఎయిర్ టెల్, ఐడియా వంటి ప్రైవేటు ఎంఎన్‌సీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఎంపికైన వారికి 4 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వార్షిక వేతనం ఆఫర్ చేస్తున్నాయి.
టెలీ‘భారతం’
- ట్రాయ్ నివేదిక ప్రకారం జూన్-2015 చివరికి మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 980 మిలియన్లు!
- ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2015 ప్రథమార్థంలో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 352 మిలియన్లు!!
- వీరిలో మొబైల్ ఫోన్ ఆధారంగా నెట్ వినియోగించే వారి సంఖ్య 236 మిలియన్లు!
- 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 4.7 బిలియన్ ఇంటర్‌నెట్ యూజర్స్ ఉంటే ఒక్క ఇండియాలోనే వారి సంఖ్య 700 మిలియన్లుగా ఉంటుందని అంచనా.
- రానున్న అయిదేళ్లలో 40 లక్షల ఉద్యోగావకాశాలు.
- ప్రతి ఏటా 35 శాతం మేర వృద్ధి నమోదు చేసుకుంటున్న రంగం.
- 2015 చివరి నాటికి 2.75 లక్షల ఉద్యోగుల అవసరమని అంచనా.
- దేశీయంగా టెలికమ్యూనికేషన్ రంగం శరవేగంగా విస్తరిస్తుందని పై గణాంకాలే నిదర్మనం.
- రాకెట్ వే గంతో విస్తరిస్తున్న ఈ రంగంలో ఇప్పుడు సుశిక్షుతులైన మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది.
- గ్రోత్ రేటు అధికంగా ఉన్న టెలికం రంగంలో ప్రవేశించటంతో ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.
- టెలికం ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి టెలికం రంగంలో మంచి అవకాశాలను ఉంటున్నాయి.
ఫ్యూచర్ వెల్ టెలికం, కమ్యూనికేషన్ అనుబంధ విభాగాల్లో యువ ఇంజనీర్లకు అద్భుత భవిష్యత్తు ఉంటుంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడం వంటివే కాకుండా.. ప్రభుత్వ లక్ష్యాల్లో భాగంగా ఐసీటీకి ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఏటేటా పెరుగుతోంది. ప్రొడక్ట్ డిజైన్ నుంచి మార్కెటింగ్ వరకు ఈ రంగంలో ప్రతి విభాగంలోనూ మానవ వనరుల ఆవశ్యకత నెలకొంది. ఈసీఈ అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుని అకడమిక్‌గా రాణించడంతోపాటు, ఈ రంగంలోని తాజా పరిస్థితులపై అవగాహన పొందితే కోర్సు పూర్తవగానే కెరీర్ పరంగా మంచి అవకాశం సొంతం చేసుకోవచ్చు. - ఎస్.కిరణ్ కుమార్, జీఎం, తాన్లా సొల్యూషన్. |
ఉన్నత విద్యతో మరింత ఉన్నతంగా టెలికం రంగంలో కెరీర్, అందుకు అవసరమైన అకడమిక్స్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఎంటెక్, తదితర ఉన్నత విద్య కోర్సులు పూర్తి చేసిన వారికి కెరీర్ అవకాశాలు మరింత ఉన్నతంగా ఉంటాయి. ముఖ్యంగా వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, అనలాగ్ సిస్టమ్స్ వంటి స్పెషలైజేషన్ల వారికి జాబ్ మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది. పీహెచ్‌డీ పూర్తి చేస్తే ఈ రంగంలోని మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో ఆర్ అండ్ డీ విభాగాల్లో సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డిజైన్ ఆర్కిటెక్ట్ వంటి అవకాశాలు లభిస్తాయి. - ప్రొఫెసర్ ఎస్.వి.ఎస్.నాగేశ్వర రావు, పీజీ డిప్లొమా ఇన్ టెలికం కోర్సు కోఆర్డినేటర్ - యూఓహెచ్ |
సర్టిఫికేట్ కోర్సులు అందిస్తున్న సంస్థలు
టెలికం ఇంజనీరింగ్ ఔత్సాహికులకు నైపుణ్యాలను మరింత పెంపొందించుకునే దిశగా మూడు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలో ఉండే పలు సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ముఖ్యమైన ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు...
- ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రైనింగ్
వెబ్‌సైట్: www.iitglobal.com
- బీఎస్‌ఎన్‌ఎల్ రీజినల్ టెలికం ట్రైనింగ్ సెంటర్
వెబ్‌సైట్: www.rttchyd.bsnl.co.in
- టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఇండియా
వెబ్‌సైట్: www.tsscindia.com
- సింక్‌రూట్ డాట్ కామ్
వెబ్‌సైట్: www.syncroute.com
- టెలికం ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
వెబ్‌సైట్: www.teleman.in
- ఎన్‌ఐటీ - రాయ్‌పూర్
- కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ - పుణె
- ట్రిపుల్ ఐటీ - పుణె
- ఐఐటీఎం - గ్వాలియర్
- అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికం ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్
Published date : 11 Sep 2015 12:22PM