ఆసక్తితో అడుగేస్తే.. ఉజ్వల భవిష్యత్!
Sakshi Education
ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్ బెస్ట్? కాలేజీ, బ్రాంచ్ ఈ రెండింట్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? ఇవీ.. ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్న సగటు విద్యార్థి సందేహాలు. నిజానికి ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్ కూడా తక్కువ కాదు! ప్రతిదీ దేనికదే సాటి అంటున్నారు నిపుణులు. విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా బ్రాంచ్‌ను ఎంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఖాయమని చెబుతున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో కొన్ని బ్రాంచ్‌లు, ఉపాధి అవకాశాలపై ఫోకస్...
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ఐటీ
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ప్రస్తుతం దేశంలో క్రేజీ కెరీర్. అందువల్లే సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచ్‌లపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మంచి పర్సంటేజీతో పాటు అప్‌డేటెడ్ స్కిల్స్‌తో ఈ కోర్సు పూర్తిచేస్తే భారీ వేతనంతో కొలువు ఖాయం. ఇతర బ్రాంచ్‌లతో పోల్చితే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువే. నైపుణ్యాలుంటే విదేశాల్లోనూ కొలువులు సొంతం చేసుకోవచ్చు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.4.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు లభిస్తుంది. ఎంసీఏ, ఇతర బ్రాంచ్‌ల విద్యార్థులు కూడా సాఫ్ట్‌వేర్ రంగంపై ఆసక్తి కనబరుస్తుండటంతో ఇందులో పోటీ కూడా ఎక్కువే. మార్కెట్ల మందగమనం సమయంలో అధిక ప్రభావానికి గురయ్యేది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. కాబట్టి ఆసక్తి, శ్రద్ధ, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే సామర్థ్యంతోపాటు మెరుగైన పనితీరుతో సీఎస్‌ఈ/ఐటీ బ్రాంచ్‌ల విద్యార్థులు సాఫ్ట్‌వేర్ కెరీర్‌లో రాణించొచ్చు.
సీఎస్‌ఈ/ఐటీలో ప్రధాన సబ్జెక్టులు: కంప్యూటర్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, డేటా స్ట్రక్చర్‌స, డిజిటల్ లాజిక్ డిజైన్, ఎలక్ట్రానిక్ డివెజైస్ అండ్ సర్క్యూట్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, జావా ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కంప్యూటర్ నెట్‌వర్క్స్, వెబ్ టెక్నాలజీస్, లైనక్స్ ప్రోగ్రామింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటావేర్ హౌసింగ్ అండ్ డేటా మైనింగ్.
టాప్ రిక్రూటర్స్: మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహూ, అమెజాన్, ఐబీఎం, ఫేస్‌బుక్, ఒరాకిల్, సిస్కో, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర కంపెనీలు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)
బీటెక్ పూర్తయ్యాక ‘గ్యాడ్జెట్ గురు’గా మారాలనుకుంటే.. బెస్ట్ చాయిస్ ఈసీఈ బ్రాంచ్. టెలీకమ్యూనికేషన్, మొబైల్ డెవలప్‌మెంట్ ఇండస్ట్రీలు కొన్నేళ్ల నుంచి సుస్థిర వృద్ధిని సాధిస్తుండటంతో ఈసీఈ పూర్తిచేసిన వారికి ఉపాధికి కొరత లేదు. మ్యాథమెటిక్స్‌పై మంచి పట్టు, ఫిజిక్స్‌పై ఆసక్తి ఉన్నవారు ఈ బ్రాంచ్‌లో త్వరగా రాణించొచ్చు. ప్రారంభంలోనే రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ప్రతిభ ఆధారంగా డిజైన్ ఇంజనీర్, ప్రాజెక్టు మేనేజర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వంటి పదోన్నతులకు చేరవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు కమ్యూనికేషన్ సిస్టమ్స్, మొబైల్ అండ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్స్, గ్లోబల్ నేవిగేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, టెలిమేటిక్ ఇంజనీరింగ్, వీఎల్‌ఎస్‌ఐ వంటి సబ్జెక్టులతో ఎంటెక్ లేదా ఎంఎస్‌లో చేరవచ్చు.
ఈసీఈలో ప్రధాన సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్ డివెజైస్ అండ్ సర్క్యూట్స్, స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్, పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థియరీ అండ్ ట్రాన్స్‌మిషన్ లైన్స్, కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, యాంటెన్నాస్ అండ్ వేవ్ ప్రాపగేషన్, ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, అనలాగ్ కమ్యూనికేషన్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, రాడార్ సిస్టమ్స్, వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ అండ్ నెట్‌వర్క్స్.
టాప్ రిక్రూటర్స్: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), ఇంటెల్, సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, సోనీ, తొషీబా, ఫిలిప్స్ సెమీకండక్టర్స్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తదితర సంస్థలు.
మెకానికల్ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్‌లో విస్తృత అవకాశాలకు ఆస్కారం ఉన్న బ్రాంచ్.. మెకానికల్. మనిషి శారీరక శ్రమను తగ్గించే ప్రతి యంత్రం మెకానికల్ ఇంజనీర్‌ల రూపకల్పనే! యంత్రం రూపకల్పన, పరీక్ష, పర్యవేక్షణ మెకానికల్ ఇంజనీర్ల విధి. ప్రస్తుతం వాహన తయారీ కంపెనీల్లో నెలకొన్న పోటీ దృష్ట్యా నూతన ఆవిష్కరణల కోసం మెకానికల్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రారంభంలో ప్రతిభావంతులైన మెకానికల్ ఇంజనీర్లకు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. నైపుణ్యం, పనితీరు, కంపెనీని బట్టి వేతనాల స్థాయి ఉంటుంది. ఉన్నత విద్యకు కూడా మంచి అవకాశాలున్న బ్రాంచ్ ఇది.
మెకానికల్ ఇంజనీరింగ్‌లో ప్రధాన సబ్జెక్టులు: మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, థర్మో డైనమిక్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్, కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ, మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, డిజైన్ ఆఫ్ మెషిన్ మెంబర్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్...
టాప్ రిక్రూటర్స్: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), డీఆర్‌డీవో, ఇండియన్ రైల్వే, మిధానీ, టాటా మోటార్స్, ఫియట్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర సంస్థలు.
సివిల్ ఇంజనీరింగ్
భవన నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుండటంతో సివిల్ ఇంజనీర్లకు అవకాశాలకు కొదవ లేదు. సివిల్ ఇంజనీర్లు ప్రధానంగా రోడ్లు, భవనాలు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, వాటర్, పవర్ ప్రాజెక్టులు, నౌక, విమానాశ్రయ నిర్మాణాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. నిర్మాణం డిజైన్ ప్లాన్ నుంచి అవి పూర్తయ్యే వరకు సివిల్ ఇంజనీర్ల పర్యవేక్షణలోనే జరుగుతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా నిర్మాణాలను రూపొందించడానికి సివిల్ ఇంజనీర్ల ప్రతిభ చాలా అవసరం. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. 5 నుంచి పదేళ్ల అనుభవంతో ఆకర్షణీయ వేతనం అందుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో కూడా సివిల్ ఇంజనీర్లకు మంచి అవకాశాలు ఉన్నాయి.
సివిల్ ఇంజనీరింగ్‌లో చదివే ప్రధాన సబ్జెక్టులు: స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, సర్వేయింగ్, బిల్డింగ్ మెటీరియల్స్, కన్‌స్ట్రక్షన్ అండ్ ప్లానింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్ ఆఫ్ బిల్డింగ్స్, కాంక్రీట్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ జియాలజీ, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ వంటివి.
టాప్ రిక్రూటర్స్: లార్సెన్ అండ్ టౌబ్రో లిమిటెడ్, ఇండియన్ రైల్వేస్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, డీఆర్‌డీవో, ఇస్రో, పీడబ్ల్యూడీ, డీఎల్‌ఎఫ్ తదితర కంపెనీలు.
కెమికల్ ఇంజనీరింగ్
ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్‌తోపాటు పర్యావరణంలో వస్తున్న మార్పులతో కెమికల్ ఇంజనీర్ల ఆవశ్యకత పెరిగింది. ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీపై ఆసక్తి, పట్టున్న విద్యార్థులకు ఈ బ్రాంచ్ బెస్ట్ ఆప్షన్. బయోటెక్నాలజీ, బయోకెమికల్, నానోటెక్నాలజీ వంటి శాస్త్రీయ పరిశోధన, అభివృద్ధి సంస్థలు, పునరుత్పాదక శక్తి, అణు విద్యుత్, మెటలర్జీ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రారంభ వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్‌లో పరిశోధన విద్యార్థులకు విస్తృత అవకాశాలు ఉన్నాయి.
కెమికల్ ఇంజనీరింగ్‌లో చదివే ప్రధాన సబ్జెక్టులు: ఇంట్రడక్షన్ టు కెమికల్ ఇంజనీరింగ్, అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ థర్మో డైనమిక్స్, కెమికల్ టెక్నాలజీ, కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం అండ్ పెట్రో కెమికల్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్.
టాప్ రిక్రూటర్స్: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎస్సార్ ఆయిల్ లిమిటెడ్, గుజరాత్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్, ఇండో గల్ఫ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ తదితర సంస్థలు.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ)
ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై విస్తృత పరిశోధనలు జరుగుతుండటంతో ఆయా రంగాల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈఈఈ చదివిన వారికి ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు ఎక్కువ. విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలు, స్టీల్ పరిశ్రమలు, రైల్వేలు, నిర్మాణ రంగ సంస్థల్లో ఇంజనీర్లుగా చేరవచ్చు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది.
ఈఈఈలో ప్రధాన సబ్జెక్టులు: ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ మెషినరీ, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, నెట్‌వర్క్ థియరీ, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైక్రోప్రాసెసర్స్ అండ్ ఇంటర్‌ఫేసింగ్ డివెజైస్, యుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, హైవోల్టేజ్ ఇంజనీరింగ్..
టాప్ రిక్రూటర్స్: బజాజ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్), క్రాంప్టన్‌గ్రీవ్స్ లిమిటెడ్, సీమెన్స్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ తదితర సంస్థలు.
ఇంజనీరింగ్‌లో పైన పేర్కొన్న సంప్రదాయ కోర్సులే కాకుండా ఇటీవల ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ తదితర బ్రాంచ్‌లపై కూడా విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఆయా కాలేజీల్లో ఉన్న వసతులు, ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్లు తదితరాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా సరైన బ్రాంచ్‌ను ఎంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.

ఇంజనీరింగ్‌లో అన్ని బ్రాంచ్‌లకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఐటీ, కంప్యూటర్ సైన్స్‌లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండటంతో అందులో పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ, కోర్సు ఏదైనా తమ ఆసక్తి, సామర్థ్యానికి అనుగుణంగా విద్యార్థులు ఎంచుకోవాలి. మంచి పర్సంటేజీ, నైపుణ్యాలు సాధిస్తే ఏ బ్రాంచ్ అయినా ఉద్యోగాలకు కొదవలేదు. ఉన్నత చదువులకు కూడా ఆస్కారం ఉంటుంది. అన్ని వసతులు, లేబొరేటరీ, మంచి ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలో చేరాలి. గతేడాది కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే ఏ కేటగిరీలో ఏ ర్యాంకుకు ఏయే కాలేజీల్లో సీటు వస్తుందో అంచనా వేసుకోవచ్చు. - డాక్టర్ ఎ.గోవర్ధన్, ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్ |
Published date : 29 Jun 2016 01:26PM